రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

"మేక్ ఇన్ ఇండియా" పథకం

Posted On: 21 SEP 2020 4:16PM by PIB Hyderabad

సాయుధ దళాల అవసరాల ఆధారంగా స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణయించడం జరిగింది.  ముప్పు అవగాహన, కార్యాచరణ సవాళ్లు మరియు సాంకేతిక మార్పుల ఆధారంగా మరియు భద్రతా సవాళ్ల యొక్క మొత్తం స్వరూపాన్ని ఎదుర్కోవటానికి సాయుధ దళాలను సంసిద్ధ స్థితిలో ఉంచడం కోసం, రక్షణ పరికరాల సేకరణ వివిధ దేశీయ మరియు విదేశీ అమ్మకందారుల నుండి చేపట్టడం జరిగింది. 

రక్షణ రంగంలో దేశీయ రూపకల్పన, అభివృద్ధి మరియు రక్షణ వస్తువుల తయారీని ప్రోత్సహించే వివిధ విధాన కార్యక్రమాల ద్వారా, ‘మేక్ ఇన్ ఇండియా’ ను అమలు చేయడం జరుగుతోంది.   రక్షణ సేకరణ విధానం (డి.పి.పి) ప్రకారం, ‘కొనండి (భారతీయం-ఐ.డి.డి.ఎం)'; ‘కొనండి (భారతీయం)’; ‘కొనండి మరియు తయారుచేయండి (భారతీయం)’; ‘కొనండి మరియు తయారు చేయండి’; ‘వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా’ లేదా కొనుగోలు (అంతర్జాతీయం) వర్గాని కంటే ‘తయారీ’ వర్గాలు ఎక్కువగా ఉండాలి, అనే విధానాలను అమలుచేయడం ద్వారా, మూలధన సామగ్రి సమకూర్చుకోడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.  రక్షణ సేకరణ విధానం (డి.పి.పి) ప్రకారం దేశీయ తయారీని ప్రోత్సహించే విధంగా మూలధన సామాగ్రి సమకూర్చుకోవడం కోసం వివిధ వర్గాల క్రింద, గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో, అంటే 2014-15 నుండి 2019-2020 వరకు (2019 డిసెంబర్ వరకు), ప్రభుత్వం, సుమారు 4,15,006 కోట్ల రూపాయల విలువైన 226 రక్షణ ప్రతిపాదనలకు, అవసరాలకు అనుగుణంగా అంగీకారం (ఏ.ఓ.ఎన్) తెలియజేయడం జరిగింది. 

ప్రభుత్వం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' విధానం కింద, 155 ఎం.ఎం. ఆర్టిలరీ గన్ సిస్టమ్ 'ధనుష్';  లైట్ కంబాట్ ఎయిర్  క్రాఫ్ట్ 'తేజస్';  'ఆకాష్' సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్;  ఎటాక్ సబ్ ‌మెరైన్ 'ఐ.ఎన్.ఎస్. కల్వరి';  'ఐ.ఎన్.ఎస్. చెన్నై' వంటి అనేక ముఖ్యమైన రక్షణ పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం జరిగింది.  గత మూడేళ్లలో అంటే 2017-18 నుండి 2019-20 వరకు రక్షణ పరికరాల సేకరణ వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి: -

(విలువ కోట్ల రూపాయలలో)




సంవత్సరం 

భారత వనరుల నుండి మూలధన మరియు రెవిన్యూ వ్యయం

(సి.జి.డి.ఏ. నుండి స్వీకరించిన సమాచారం ఆధారంగా)

2017-18

54951.38

2018-19

50507.65

2019-20

63784.75

 

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్ ఈ రోజు లోక్ సభలో శ్రీమతి సర్మిస్థ సేథి కి అందజేసిన లిఖితపూర్వక సమాధానంలో, ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

*****



(Release ID: 1657535) Visitor Counter : 208


Read this release in: Marathi , English , Bengali , Tamil