ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారతదేశంలో హెచ్ఐవి / ఎయిడ్స్ రోగులు

Posted On: 20 SEP 2020 8:24PM by PIB Hyderabad

ప్రభుత్వ తాజా హెచ్.‌ఐ.వి. అంచనాల నివేదిక (2019) ప్రకారం, భారతదేశంలో 2019 లో హెచ్.‌ఐ.వి / ఎయిడ్స్‌ (పి.ఎల్.‌హెచ్.‌ఐ.వి) తో సుమారు 23.49 లక్షల మంది జీవిస్తున్నట్లు అంచనా.  హెచ్.ఐ.వి. మహమ్మారి దేశం మొత్తం మీద తగ్గుతున్న ధోరణిని కలిగి ఉంది. అంచనా ప్రకారం వార్షిక కొత్త  హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్లు 2010 మరియు 2019 మధ్య 37 శాతం తగ్గాయి.

భారతదేశంలో  హెచ్.ఐ.వి. సంక్రమణ ప్రధానంగా అధిక ప్రమాద ప్రవర్తనలలో పాల్గొనడం వల్ల సంభవిస్తోంది.   భారతదేశంలో హెచ్.ఐ.వి. సంక్రమణకు గుర్తించబడిన ప్రధాన అధిక-ప్రమాద ప్రవర్తనలలో ముఖ్యంగా సురక్షితం కాని భిన్న లైంగిక సంపర్క ప్రవర్తన, సురక్షితం కాని స్వలింగ సంపర్క ప్రవర్తన మరియు సురక్షితం కాని ఇంజెక్షన్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగ ప్రవర్తనలు ఉన్నాయి.

హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రులు లేవు.  అయితే, ప్రభుత్వ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం (ఎన్.‌ఐ.సి.పి) ప్రకారం, జూలై 2020 నాటికి 570 యాంటీ - రెట్రో వైరల్ చికిత్స (ఎ.ఆర్.టి) కేంద్రాలు మరియు 1264 లింక్ ఏ.ఆర్.టి. కేంద్రాలు ఉన్నాయి.

తాజా హెచ్‌.ఐ.వి. అంచనాల నివేదిక (2019) ప్రకారం 2018 మరియు 2019 సంవత్సరాల్లో హెచ్‌.ఐ.వి. / ఎయిడ్స్‌ తో జీవిస్తున్న ప్రజల వివరాలు రాష్ట్రాలు / కేంద్ర పాలితప్రాంతాల వారీగా అనుబంధంలో పొందుపరచడం జరిగింది. 

అనుబంధం 

2018 మరియు 2019 సంవత్సరాల్లో హెచ్.ఐ.వి. / ఎయిడ్స్‌ తో జీవిస్తున్న రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ప్రజల వివరాలు (లక్షల్లో) 

క్రమ సంఖ్య 

రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు 

2018

2019

1

ఆంధ్రప్రదేశ్ 

3.28

3.14

2

అరుణాచల్ ప్రదేశ్ 

0.01

0.01

3

అస్సాం 

0.21

0.21

4

బీహార్ 

1.31

1.34

5

ఛతీస్ గఢ్ 

0.42

0.43

6

ఢిల్లీ 

0.66

0.68

7

గోవా 

0.05

0.05

8

గుజరాత్ 

1.04

1.04

9

హిమాచల్ ప్రదేశ్ 

0.07

0.07

10

హర్యానా 

0.45

0.45

11

ఝార్ఖండ్ 

0.22

0.23

12

జమ్మూ, కశ్మీర్ మరియు లడఖ్ 

0.06

0.06

13

కర్ణాటక 

2.80

2.69

14

కేరళ 

0.24

0.24

15

మేఘాలయ 

0.11

0.11

16

మహారాష్ట్ర 

4.05

3.96

17

మణిపూర్ 

0.29

0.29

18

మధ్య ప్రదేశ్ 

0.59

0.59

19

మిజోరాం 

0.20

0.20

20

 నాగాలాండ్ 

0.22

0.23

21

ఒడిశా 

0.50

0.49

22

పంజాబ్ 

0.66

0.66

23

రాజస్థాన్ 

0.62

0.63

24

సిక్కిం 

0.003

0.003

25

తమిళనాడు 

1.59

1.55

26

త్రిపుర 

0.02

0.03

27

ఉత్తరాఖండ్ 

0.11

0.11

28

ఉత్తరప్రదేశ్ 

1.61

1.61

29

పశ్చిమ బెంగాల్ 

0.73

0.74

30

అండమాన్, నికోబార్ దీవులు 

0.005

0.005

31

 చండీగఢ్ 

0.02

0.02

32

దాద్రా, నాగర్ హవేలీ 

0.01

0.01

33

డామన్ ,డయ్యు 

0.005

0.005

34

 పుదుచ్చేరి 

0.05

0.05

35

తెలంగాణ 

1.60

1.58

36

భారతదేశం 

23.81

23.49

మూలం: భారత  హెచ్.‌ఐ.వి అంచనాలు-2019 నివేదిక

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు ఇక్కడ రాజ్యసభ లో లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. 

*****


(Release ID: 1657155) Visitor Counter : 2358


Read this release in: English , Urdu , Manipuri