ఆర్థిక మంత్రిత్వ శాఖ

జిఎస్‌టి రెవిన్యూ లోటును పూడ్చడానికి రుణం

Posted On: 20 SEP 2020 2:07PM by PIB Hyderabad

జిఎస్‌టి(రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 లోని సెక్షన్లు 7, 8 & 10 లోని నిబంధనల ప్రకారం, జీఎస్టీ పరిహారం లోటును తీర్చడానికి పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ పరిహారం, భవిష్యత్ చర్యల గురించి 27.08 2020 న 41 వ  జిఎస్‌టి   కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. భారత అటార్నీ జనరల్ ఇచ్చిన అభిప్రాయం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. మార్కెట్ రుణాలు నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిఎస్‌టి పరిహార లోటును తీర్చడానికి రాష్ట్రాల ముందు రెండు ప్రతిపాదనలు ఉంచారు. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే కేంద్ర ప్రభుత్వమే మార్కెట్ రుణాన్ని తీసుకొని జిఎస్‌టి లోటును పూడ్చడానికి రాష్ట్రాలకు పరిహారంగా ఇవ్వాల్సిందిగా కొన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు సూచించాయి. దీనికి సంబంధించి ఇంకా వారి ఎంపికను తెలియజేయని రాష్ట్రాలతో కేంద్ర నిరంతరం సంప్రదింపులు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

రుణాలు పొందడంపై రాష్ట్రాలకు కేంద్ర వ్యయ విభాగం పంపిన రెండు ఎంపికల వివరాలను శ్రీ ఠాకూర్ ఈ కింద విధంగా వివరించారు:-

ప్రతిపాదన - 1

 

  1. జీఎస్టీ అమలు వల్ల తలెత్తే లోటు (సుమారుగా రూ. 97,000 కోట్లుగా లెక్కకు వచ్చింది) ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో ప్రత్యేక విండో కింద రుణాల జారీ ద్వారా రాష్ట్రాలు రుణం తీసుకుంటాయి.
  2. జిఎస్టి పరిహారం ఏ విధంగా అయితే నిరంతర చెల్లింపులు జరుగుతున్నాయో, అదే మాదిరీ వనరుల ప్రవాహం కూడా ఉండేలా నెలకి రెండు సార్లు నిర్ధారించాలి.  
  3. కేంద్ర ప్రభుత్వం జి-సెక్యూరిటీ లపై వచ్చే ఆదాయం, రాష్ట్ర అభివృద్ధి రుణాల నుండి వచ్చే ఆదాయంతో బేరీజు వేస్తూ తగు సబ్సిడీ రూపంలో ఆ మార్జిన్ ని భరించడం. 
  4. వ్యయ విభాగం నోటిఫై చేసిన ఇతర సాధారణ లేదా ప్రత్యేక అనుమతి కింద అర్హత ఉన్న ఇతర రుణాలు తీసుకునే పరిమితులకు మించి  ఈ మొత్తానికి ఆర్టికల్ 293 ప్రకారం ప్రత్యేక రుణాలు తీసుకునే అనుమతి ఇవ్వబడుతుంది,  
  5. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి (దేశ రాజధాని ప్రాంతంతో సహా ), వారికి ప్రత్యేక విండో కింద వనరుల ప్రవాహాన్ని నిర్ధారించడానికి తగిన ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది
  6. ప్రత్యేక విండో కింద తీసుకున్న రుణం వడ్డీని సెస్ నుండి, పరివర్తన కాలం ముగిసే వరకు చెల్లిస్తారు. పరివర్తన కాలం తరువాత, సెస్ ఆదాయం నుండి అసలు, వడ్డీ కూడా చెల్లిస్తారు. రుణానికి సర్వీసుకి కానీ, మరే ఇతర వనరుల నుండి కానీ  రాష్ట్రం తిరిగి చెల్లించ అవసరం లేదు.
  7. వ్యయ విభాగం OM F.No.4 వ పేరాలో అనుమతించబడిన తుది విడత 0.5% (వాస్తవానికి పేర్కొన్న నాలుగు సంస్కరణలలో కనీసం మూడు పూర్తి చేయడానికి బోనస్‌గా ఉద్దేశించింది) రుణం తీసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇస్తారు. దీనివల్ల మొత్తం సుమారు రూ. 1 లక్ష కోట్లు ఋణం తీసుకోవచ్చు.... 

                        ఇంకా ఇతరత్రా ప్రతిపాదనలను ఎంపిక-1లో రాష్ట్రం ముందు ఉంచారు

 
      ఇక ఎంపిక-2లో ప్రతిపాదనలు చుస్తే... 
  1. మొత్తం 235,000 కోట్ల రూపాయల లోటు (కోవిడ్- ప్రభావిత భాగంతో సహా) మార్కెట్ రుణాల జారీ ద్వారా రాష్ట్రాలు రుణం తీసుకోవచ్చు
  2. ముందుగా నోటిఫై చేసిన పథకం మార్పులకు అనుగుణంగా , ఆర్టికల్ 293 కింద తగిన మెరుగైన ప్రత్యేక రుణాలకు కొన్ని పద్దతుల ద్వారా కేంద్రంనుంచి అనుమతి ఇస్తారు. 
  1. రాష్ట్రాలు తమ ఆర్ధిక వనరుల నుంచే వడ్డీ చెల్లించాలి 
     ఇలా మరి కొన్ని అంశాలను ఈ రెండో ప్రతిపాదనలో కేంద్రం పొందుపరిచి రాష్ట్రాల ముందు ఉంచింది

రాష్ట్రాలు తమ ప్రాధాన్యతలను, అభిప్రాయాలను ఇస్తాయని కూడా నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. పథకం ఖరారు చేసిన తరువాత, రాష్ట్రాలు ఆప్షన్ 1 లేదా ఆప్షన్ 2 ను ఎంచుకోవచ్చు, తదనుగుణంగా వారి పరిహారం, రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడం మొదలైనవి వారి వ్యక్తిగత ఎంపిక ప్రకారం జరుగుతుంది . ఎల్డి. అటార్నీ జనరల్ అభిప్రాయం ఈ అనుబంధంలో పొందుపరిచారు 

Click on the following link:

 

Annexure

****


(Release ID: 1657088) Visitor Counter : 232