నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
నైపుణ్యం కలిగిన కార్మికుల డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించడానికి వివిధ పథకాలు
Posted On:
19 SEP 2020 5:40PM by PIB Hyderabad
నైపుణ్యం కలిగిన కార్మికుల డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలవారీగా / సమూహ-నిర్దిష్ట పథకాలను అమలు చేస్తోంది. నైపుణ్య అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డిఇ) ఈ క్రింది పథకాలు / కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది.
ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై) నేషనల్ స్కిల్డ్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్) లో శిక్షణ పొందిన కార్మికులను ముందస్తుగా గుర్తించడం ద్వారా ప్రైవేట్ శిక్షణ భాగస్వాముల ప్రమేయం ద్వారా సమలేఖనం చేయబడిన అర్హతలతో యువతకు స్వల్పకాలిక నైపుణ్య శిక్షణను ఇస్తుంది. జన్ శిక్షణ్ సంస్థ (జెఎస్‌ఎస్) స్థానిక మార్కెట్లో సంబంధిత నైపుణ్యాలను గుర్తించడం ద్వారా అక్షరాస్యత లేనివారు, పాక్షికంగా అక్షరాస్యత గల నియో-అక్షరాస్యులు, పాఠశాల విద్యనభ్యసించేవారికి వృత్తి శిక్షణ ఇస్తుంది. అప్రెంటిస్‌షిప్ పథకం పరిశ్రమలో యువతకు అప్రెంటిస్‌షిప్ ద్వారా శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని అందుబాటులోకి తెస్తుంది. అప్రెంటిస్‌కి చెల్లించే స్టైఫండ్‌లో 25% కేంద్ర ప్రభుత్వం వాటాగా భరిస్తుంది...అప్రెంటిస్‌షిప్ కోసం ప్రతి అభ్యర్థికి నెలకు రూ .1500 / వరకు పరిమితం. దాదాపు 15000 పారిశ్రామిక శిక్షణా సంస్థల ద్వారా 137 ట్రేడ్‌లలో క్రాఫ్ట్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సిటిఎస్) దీర్ఘకాలిక శిక్షణ ఇస్తుంది.
ఇంకా, మంత్రిత్వ శాఖ ‘అఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్ (అసీమ్)’ పోర్టల్‌ను ప్రారంభించింది, ఇది అధికారికంగా నైపుణ్యం కలిగిన వ్యక్తులందరి డైరెక్టరీ లాంటిది, దేశంలో ఎక్కడైనా వారి నైపుణ్యం కలిగిన మానవశక్తి అవసరాలను తీర్చడానికి వారి వివరాలు పరిశ్రమకు దీని ద్వారా అందుబాటులో ఉంటాయి. పరిశ్రమ అవసరాలు, జిల్లా / రాష్ట్ర / క్లస్టర్‌కు డిమాండ్, కీలకమైన పనివారి సరఫరాదారులు మొదలైన వాటితో సహా డిమాండ్, సరఫరా విధానాల గురించి రియల్ టైం డేటాను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి మార్కెట్లో డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించడానికి ఈ పోర్టల్ ప్రయత్నిస్తుంది.
స్కిల్ ఇండియా మిషన్ కింద 31.08.2020 నాటికి 98,370 మందికి యోగా బోధకులు, శిక్షకులుగా శిక్షణ పొందారు.
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా పోరాడడం ద్వారా దేశానికి సహాయపడటానికి మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది. కొన్ని ప్రధాన దశలు క్రింది విధంగా ఉన్నాయి: -
- హెల్త్ వర్కర్స్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్, హోమ్ హెల్త్ ఎయిడ్ వంటి ఆరోగ్య రంగ నిపుణులలో మంత్రిత్వ శాఖ నైపుణ్య పర్యావరణ వ్యవస్థ ద్వారా శిక్షణ పొందిన 1,75,000 మంది వ్యక్తుల డేటాబేస్ మహమ్మారి సమయంలో వారి సేవలను ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలకు అందుబాటులో ఉంచారు;
- నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఎన్ఎస్టీఐలు) / పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటిఐలు) లోని సౌకర్యాలు క్వారంటైన్ కేంద్రాలు / ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించడానికి రాష్ట్రాలకు అందుబాటులో ఉంచారు.
- సుమారు 32 లక్షల ఫేస్ మాస్క్‌ను జన శిక్షా సంస్థాన్ (జెఎస్‌ఎస్), ఐటిఐలు, ఎన్‌ఎస్‌టిఐలు తయారు చేసి పంపిణీ చేశాయి.
- తిరిగి వచ్చే వలస కార్మికుల నైపుణ్యం స్థాయిలు మ్యాప్ చేశారు. ఈ వలసదారులకు స్థానిక జీవనోపాధి అవకాశాల లభ్యతను నిర్ధారించడానికి, 3 లక్షల మందికి శిక్షణ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.
- విదేశాల నుండి తిరిగి వచ్చిన వలసదారుల డేటాను అసీమ్ లో పొందుపరిచి, వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించటానికి తగు ఏర్పాట్లు చేశారు.
- 29 బాగా ప్రాచుర్యం పొందిన కోర్సులు, ఇ-లెర్నింగ్ వీడియో కంటెంట్ తో 71 కోర్సులు, 9,38,851 మంది ట్రైనీలకు లబ్ధి చేకూర్చే ఐటిఐల కోసం క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సిటిఎస్) కింద మొత్తం 137 ట్రేడ్లకు సంబంధించిన ఆన్‌లైన్ శిక్షణను భారత్ స్కిల్స్ పోర్టల్ ద్వారా నిర్వహించారు;
మేధో సంపత్తి హక్కుల (పేటెంట్ లు) దాఖలుకు సంబంధించి, ఒడిశాలోని ప్రభుత్వ ఐటిఐ బెర్హాంపూర్, దాని మూడు వినూత్న ఉత్పత్తులను పేటెంట్ కోసం నమోదు చేసింది; (i) యువిసి (అతినీలలోహిత సి) రోబో వారియర్, (ii) మొబైల్ స్వాబ్ కలెక్షన్ కియోస్క్ (iii) స్మార్ట్ యువిసి క్రిమిసంహారక వ్యవస్థ.
ఈ సమాచారం రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు.
****
(Release ID: 1656938)
Visitor Counter : 144