మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఉపకార వేతన పథకాలపై 2019-20లో 67,21,630 మంది లబ్ధిదారుల కోసం రూ.2,204.44 కోట్లు వెచ్చించిన అల్పసంఖ్యాకవర్గ వ్యవహారాల మంత్రిత్వశాఖ;

“దేశవ్యాప్త దిగ్బంధంలోనూ పైన పేర్కొన్న అల్పసంఖ్యాకవర్గ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉపకార వేతన పథకాలు జాతీయ స్కాలర్షిప్ పోర్టల్/ఆన్లైన్ పోర్టల్ద్వారా అమలైనందున చెల్లింపులపై ప్రభావంలేదు:ముక్తార్ అబ్బాస్ నఖ్వీ”

“స్కాలర్షిప్ మొత్తాలు ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డిబిటి) పద్ధతిలో
నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయబడ్డాయి”

प्रविष्टि तिथि: 19 SEP 2020 6:36PM by PIB Hyderabad

అల్పసంఖ్యాకవర్గ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉపకార వేతన

పథకాల కింద 2019-20లో వెచ్చించిన మొత్తం... లబ్ధిదారుల సంఖ్య

లబ్ధిదారుల సంఖ్య

వెచ్చించిన మొత్తం (రూ.కోట్లలో)

67,21,630

2204.44

 

దేశవ్యాప్తంగా 2019-20లో మూడు పథకాలు... “ప్రీ-మెట్రిక్‌-పోస్ట్‌ మెట్రిక్‌, మెరిట్‌-కమ్‌-మీన్స్‌, బేగం హజరత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పథకాల కింద ఉపకార వేతనాలు  పంపిణీ చేయబడ్డాయి. ఇవి 2020-21లోనూ కొనసాగుతాయి.

దేశవ్యాప్త దిగ్బంధంలోనూ పైన పేర్కొన్న అల్పసంఖ్యాకవర్గ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉపకార వేతన పథకాలు జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్‌ఎస్‌పి)/ఆన్‌లైన్ పోర్టల్‌ద్వారా అమలైన కారణంగా ఉపకార వేతనాల చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడలేదు. అంతేగాక స్కాలర్‌షిప్ మొత్తాలన్నీ ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డిబిటి) పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి.

   కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.

***


(रिलीज़ आईडी: 1656852) आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English