గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన భాషల పరిరక్షణకు గాను ద్విభాషా ప్రైమర్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు/ యుటీలకు గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మద్దతు

-ఇప్పటి వరకు 82 భాషా ప్రైమర్‌లు అభివృద్ధి చేసిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు: అర్జున్ ముండా

Posted On: 19 SEP 2020 6:00PM by PIB Hyderabad

భారత్‌లో 780 భాషలు మాట్లాడుతున్న‌ట్టుగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యయనాల ద్వారా తెలిసింది. వీటిలో 443 గిరిజన వర్గాలు మాట్లాడేవిగా తేలింది. ఈ భాషల వివరాలు https://www.peopleslinguisticsurvey.org/ లో ఉన్నాయి. గుజరాత్ లోని 'భాషా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్' చేత గిరిజన భాషల రంగంలో పరిశోధనలు జరపడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్సలెన్స్ కేంద్రంగా గుర్తించ‌డ‌మైంది. గిరిజన భాషల పరిరక్షణ కోసం ద్విభాషా ప్రైమర్‌ల అభివృద్ధికి మరియు షెడ్యూల్డ్ తెగ విద్యార్థులలో అభ్యాస సాధన స్థాయిని పెంచడానికి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు/ యుటీలకు మద్దతునిస్తుంది.
ఇప్పటివరకు 82 భాషా ప్రైమర్‌లను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేశాయి. ఉదాహరణకు ఒడాశాలోని జువాంగ్, కిసాన్, కోయా, ఓరం, సౌరా, హల్బీ, కోర్కు, భిలి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని
గోండి మరియు జార్ఖండ్‌లోని ఖాడియా, ఖోరత్ త‌దిత‌రాలున్నాయి. ఇది ఇంకా కొనసాగుతున్న ప్రక్రియ. ‘గిరిజన ఉత్సవం, పరిశోధన సమాచారం మరియు సామూహిక విద్య’ పథకం కింద ‘టీఆర్‌ఐకి మద్దతు’ పథకం మ‌రియు ‘భాషా రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్’కు (ది సీఓఈ)
ప‌థ‌కం కింద భాషా ప్రైమర్‌ల అభివృద్ధికి గాను గత మూడేళ్లలో అందించిన నిధుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

సంవ‌త్స‌రం


‘టీఆర్‌ఐకి మద్దతు’ పథకం కింద వివిధ రాష్ట్రాలకు స‌మ‌కూర్చిన నిధులు

(రూ. ల‌క్ష‌ల్లో)

‘గిరిజన ఉత్సవం, పరిశోధన సమాచారం మరియు సామూహిక విద్య’ పథకం కింద భాషా పరిశోధన మరియు ప్రచురణ కేంద్రానికి స‌మ‌కూర్చిన నిధులు

(రూ. ల‌క్ష‌ల్లో)

మొత్తం

(రూ. ల‌క్ష‌ల్లో)

2017-18

19.00

14.08

33.08

2018-19

184.00

41.00

225.00

2019-20

134.00

21.38

155.38

 గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ స‌మాచారాన్ని తెలియ‌జేశారు.

                                                                                            *****


(Release ID: 1656851) Visitor Counter : 125