గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పీవీటీజీ గిరిజన సమూహాల కోసం సామాజిక భద్రతా పథకం
Posted On:
19 SEP 2020 5:57PM by PIB Hyderabad
'అత్యధికంగా హాని పొంచివున్న గిరిజన సమూహాం'ల (పీవీటీజీ) నిమిత్తం గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సామాజిక భద్రతా పథకంను తయారుచేసే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరతో (ఎంఎస్‌పీ) కూడిన 'మెకానిజం ఫర్ మార్కెటింగ్ ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్' (ఎంఎఫ్‌పీ) పథకాన్ని కూడా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఎమ్‌ఎఫ్‌పీ కోసం వాల్యూ చైన్ అభివృద్ధి కూడా నిర్వహిస్తోంది. ఇందులో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ సేకరించే వారిలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉన్నారు. నోటిఫైడ్ అటవీ ఉత్పత్తుల సేకరణలో వారు చేస్తున్న ఆయా ప్రయత్నాలకు సరసమైన రాబడిని లభించేలా కూడా చర్యలను చేపట్టింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 'వన్‌ధన్ వికాస్ కార్యక్రమ్' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. స్థిరమైన సాగుకు దోహదం చేసేలా ఎంఎఫ్‌పీలు సేకరించే వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, వారి నైపుణ్యాల విలువల్ని జోడించడం, అవసరమైన సాధనాలు మరియు సౌకర్యాలను కల్పించడం వంటి ప్రయోజనాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఇది గిరిజన తెగల్లోని లబ్ధిదారులకు రాబడిని మరింత మెరుగుపరుస్తుంది. ఈ సమాచారాన్ని గిరిజన వ్యవహారాల మంత్రి ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1656835)
Visitor Counter : 129