సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
వారసత్వ మూలికలుగా గుర్తించిన 5 రకాల మొక్కలను నాటడం ద్వారా, జూన్ 28 నుంచి జులై 12 మధ్య "సంకల్ప్ పర్వ" నిర్వహించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
Posted On:
19 SEP 2020 6:11PM by PIB Hyderabad
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ స్పష్టమైన పిలుపు మేరకు, ఈ ఏడాది జూన్ 28 నుంచి జులై 12 మధ్య "సంకల్ప్ పర్వ"ను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించింది. దేశంలో స్వచ్ఛమైన, ఆరోగ్యవంత వాతావరణాన్ని సృష్టించడం దీని ఉద్దేశం. మన దేశ వారసత్వ మూలికలైన మర్రి, ఉసిరి, రావి, అశోక, బిల్వ చెట్ల మొక్కలను నాటాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మంత్రిత్వ శాఖ, అనుబంధ విభాగాల కార్యాలయాల ఆవరణల్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదా అవకాశం ఉన్న చోట ఈ మొక్కలను నాటాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయలేదు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా "సంకల్ప్ పర్వ" కార్యక్రమానికి మంత్రిత్వ శాఖ ప్రచారం కల్పించింది. మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, అనుబంధ విభాగాల కార్యాలయాల ఆవరణల్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదా అవకాశం ఉన్న చోట 11,442 మొక్కలను అధికారులు నాటారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ పటేల్ సింగ్, లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని లోక్‌సభకు సమర్పించారు.
(Release ID: 1656778)
Visitor Counter : 112