మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
శిక్షాపర్వ్ కింద పునాది విద్య, అంకెలపై అవగాహన కల్పించడంపై వెబినార్
మన పాఠశాలల్లో ప్రాథమిక అక్షరాస్యత ను అమలు చేయడం, అంకెలపై పిల్లలలో అవగాహన కల్పించడంలో సవాళ్లపై తమ అభిప్రాయాన్ని పంచుకున్న ఒక జాతీయ ఉపాధ్యాయ అవార్డు పొందిన టీచర్
Posted On:
18 SEP 2020 5:32PM by PIB Hyderabad
శిక్షా పర్వ్ కార్యక్రమం కింద పునాది విద్య, పిల్లలకు అంకెలపై అవగాహన కల్పించడంపై కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఒక వెబినార్‌ను ఏర్పాటు చేసింది. ఈ వెబినార్‌లొ నూతన విద్యావిధానం -ఎన్ఇపి 2020లోని ముఖ్యాంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.శిక్షా పర్వ్‌ను ఈనెల 8 వ తేదీనుంచి 25 వతేదీ వరకు జరుపుకుంటున్నారు. టీచర్లను సన్మానించుకోవడంతోపాటు, 2020 నూతన విద్యా విధానాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి దీనిని నిర్వహిస్తున్నారు. ఈ
సెషన్‌కు లక్షిత లబ్ధిదారులలో ప్రీస్కూలు, లోయర్ ప్రైమరీ టీచర్లు, పాఠశాలల అధిపతులు, తల్లిదండ్రులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యా విభాగాలు ఉన్నాయి.
ఈ సమావేశంలో పాల్గొన్న నిపుణులు
ప్రొఫెసర్ అనుప్ రాజ్‌పుత్, హెడ్ పిడి, ఎన్‌సిఇఆర్‌టి
ప్రొఫెసర్ ఉషా శర్మ, డిపార్టమెంట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఎన్.సి.ఇ.ఆర్.టి
శ్రీమతి సుధా పైనులి, వైస్ ప్రిన్సిపాల్ , ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు, డెహ్రాడూన్,ఉత్తరాఖండ్
ప్రొఫెసర్ అనుప్ రాజ్‌పుత్ పునాది అక్షరాస్యత, పిల్లలకు అంకెలపై అవగాహన కల్పించడంపై సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.అనంతరం పునాది అక్షరాస్యతపై ప్రొఫెసర్ ఉషా శర్మ, శ్రీమతి సుధా పైనులి ప్రెజెంటేషన్ ఇచ్చారు.2020 జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఒకరు పునాది అక్షరాస్యత, పిల్లలకు అంకెలపై అవగాహన కల్పించడంలో పాఠశాలల్లో ఎదురయ్యే సవాళ్ల గురించి తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఈ వెబినార్ సందర్బంగా చర్చించిన ప్రధానాంశాలు కింది విధంగా ఉన్నాయి.
--పునాది అక్షరాస్యత, అంకెలపై అవగాహనకు సంబంధించి ఒక నేషనల్ మిషన్ అవసరం-వివిధ జాతీయ సర్వేలైన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (ఎన్ ఎ ఎస్) : తక్కువ అభ్యసన స్థాయిలు, పెరుగుతున్న డ్రాప్ అవుట్ రేటు, తగిన విధంగా లేని భాష, గణిత నైపుణ్యాలు.
ఎప్.ఎల్.ఎన్ సార్వత్రిక లక్ష్యాలు- అభ్యాసకులు అర్థవంతమైన పఠనం, వ్రాయడాన్ని వారు 3వ గ్రేడు పూర్తీ చేసేలోగా నేర్చుకునేట్టు చేయడం. అంకెలను ఉపయోగించడానికి సంబంధించిన సామార్ధ్యాలపై మౌలిక అవగాహనను పెంపొందింప చేయడం, దానికి సంబంధించిన ఇతర అంశాలను బాల అభ్యాసకులలో గ్రేడు 2 వరకు పెంపొందించడం, అభ్యాసకులలో పాఠశాల వెలుపల తమ అనుభవాలను తరగతి గతి అబ్యాసాలతో అనుసంధానం చేసుకునేట్టు చూడడం ఆ రకంగా పునాది అక్షరాస్యత, అంకెలపై అవగాహనను మెరుగుగా కలిగి ఉండడానికి దోహదపడడం.
పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యార్ధులైన బాలవాటిక, వంటి తరగతులకు మూడు నెలల ఆటల ఆధారిత పాటశాలకు సన్నద్థత మాడ్యూల్‌లో శబ్దాలపై కార్యక్రమాలు, వర్క్‌బుక్, అక్షరాలు, పదాలు, రంగులు, ఆకారాలు, అంకెల గురించి సహవిద్యార్థులు, తల్లిదండ్రుల ద్వారా పరిచయ కార్యక్రమాలు.
పునాది అక్షరాస్యత, అంకెలపై అవగాహనను సమర్దంగా అమలు చేయడానికి అక్షరాస్యత, అంకెలపై అవగాహనను సమ్మిళితం చేయడం కీలకం. రోజువారీ పరిభాషలో అంతర్భాగంగా గణిత పరిభాష, గణిత ఆలోచనలను అర్థం చేసుకునే విధంగా భాషను ఉపయోగించడం.
ఇ.ఎల్.పి.ఎస్ విధానాన్ని అనుసరించడంలోని ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఇందులో ఇ అనేది భౌతిక వస్తువలతో అనుభవం,ఎల్ అనేది మాట్లాడే భాష,- అది అనుభవాలను వివరిస్తుంది, పి అనేది దృశ్యం. ఇది అనుభవాన్ని అనుగుణమైన బొమ్మలు. ఎస్ అనేది గుర్తులు. ఇది అనుభవాలను సాధారణీకరిస్తుంది.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల పౌష్టికాహారం, ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మధ్యాహ్న భోజనపథకానికి తోడు మంచి పుష్టికరమైన అల్పాహారం అందివ్వాలి.
ఎన్.ఇ.పి 2020 టీచర్లకు పునాది విద్యను అందించేందుకు, అంకెలపై అవగాహన కల్పించేలా చేసేందుకు శిక్షణకు గల ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నది. సార్వత్రిక అక్షరాస్య సాధనకు , అంకెలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి టీచర్లకు మద్దతునివ్వడానికి గల అన్ని అవకాశాలను అన్వేషించడం జరుగుతుంది.
విద్యార్ధులకు చదివేందుకు అవకాశం ఇస్తే , వారిలొ పఠన నైపుణ్యాలు వాటంతట అవే సహజంగా వస్తాయి. పునాది అక్షరాస్యతతో ముడిపడిన మూడు సూచికలు , అక్షరాల స్వరూపం, వాటిని పలకడం, వాక్యనిర్మాణం, పదాల అర్థాలు.
అలాగే ఆలోచనకు తగినట్టు రాయడం పునాది అక్షరాస్యతలో ముఖ్యమైనది. దీనిప్రకారం రాయడానికి ముందు 85 శాతం సమయం ఏం రాయాలన్నది ఆలోచిస్తారని తేలింది.
జాతీయ పుస్తక ప్రోత్సాహక విధానం కింద నాణ్యమైన పుస్తకాలు అందుబాటులో ఉండాలి.దీనితో పబ్లిక్, పాఠశాల లైబ్రరీలు చెప్పుకోదగిన స్థాయిలో విస్తరించాలి.అలాగే డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు కావాలి.
***
(Release ID: 1656776)
Visitor Counter : 165