ఆయుష్
కోవిడ్ -19 నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయంటూ అక్రమ చికిత్సా విధానాలు, మందుల దందా
Posted On:
18 SEP 2020 7:10PM by PIB Hyderabad
కోవిడ్ -19 చికిత్సలో భాగంగా ఆయుష్ మంత్రిత్వశాఖను తప్పుదోవ పట్టించేలా 154 ప్రకటనల్ని అక్రమార్కులు ప్రచారం చేస్తున్న విషయం ఆయుష్ మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు వరకు అందిన ఫిర్యాదుల ప్రకారం ఇవి 154. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయుష్ మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. మందుల వినియోగానికి సంబంధించిన పలు చట్టాల కింద చర్యలు తీసుకోవాలని చెప్పింది. అంతే కాదు కోవిడ్ -19 చికిత్స కోసం సంబంధిత వ్యక్తులు చేసినట్టుగా చెబుతున్న క్లినికల్ ప్రయోగాల వివరాలను పంపాలని కోరింది. వాటిని వెరిఫై చేస్తామని చెప్పింది. కోవిడ్ - 19ను ఎదుర్కోవడం కోసం ఆయుష్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన చికిత్సల వివరాలను ఆయుష్ మంత్రిత్వశాఖ వెబ్ సైట్ www.ayush.gov.in లో చూడవచ్చని తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారి మొదలైన తర్వాత ఆయుష్ మంత్రిత్వశాఖ ఒక జెనరిక్ ఫార్ములేషన్ ను విడుదల చేసింది. దీన్ని ఆయుష్ క్వాత్ / ఆయుష్ కుదినీర్ / ఆయుష్ జొషాందా అంటారు. ఆయా రాష్ట్రాలు సంబంధిత చట్టాలు నియమ నిబంధనలు అనుసరిస్తూ ఆయుష్ జెనరిక్ ఫార్ములేషన్ ప్రకారం వాణిజ్య సరళిలో మందులు తయారు చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చాయి. ఆయుర్వేద, సిద్ధ, యునాని మందులకు వర్తించేలా ఈ అనుమతులున్నాయి.
పైన తెలియజేసిన రోగనిరోధక శక్తిని పెంచే మందులకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. అయితే కోవిడ్ -19 ను నివారిస్తుందంటూ అసంబద్ధమైన ప్రకటనలు చేసుకుంటున్న సంస్థల గురించి, దీనికోసం ఆయుష్ మందులను వాడుకుంటున్న సంస్థలు, వ్యక్తుల గురించి ఫార్మా కోవిజిలాన్స్ కేంద్రాలనుంచి ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆయా రాష్ట్రాల లైసెన్స్ విభాగ అధికారులకు, డ్రగ్ కంట్రోలర్లకు పంపడం జరిగింది.
ఆయుర్వేదిక్, సిద్ధా, యునాని మరియు అలాంటి వైద్య ఫార్ములాలకు చెందిన మందుల అమ్మకం కోసం చేసే తయారీకి ఆయుష్ మంత్రిత్వశాఖ ఆమోదం తెలపదు. వాటి నియంత్రణ, నాణ్యత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అందుకోసం రాష్ట్ర స్థాయిలో లైసెన్స్ సంస్థలు, డ్రగ్ కంట్రోలర్స్ ను నియమించడం జరిగింది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ రాతపూర్వకంగా లోక్ సభకు సమర్పించారు.
(Release ID: 1656580)
Visitor Counter : 122