రైల్వే మంత్రిత్వ శాఖ
ఐసోలేషన్ వార్డులుగా మార్పు చెందిన - ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్లు
Posted On:
18 SEP 2020 5:32PM by PIB Hyderabad
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, భారత రైల్వే (ఐ.ఆర్), 5,601 బోగీలను 2020 మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కోవిడ్ సంరక్షణ కేంద్రాలుగా మార్చారు.
ఈ కోచ్‌ల మార్పిడికి సంబంధించి రైల్వే జోన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:
క్రమ సంఖ్య
|
రైల్వే జోన్లు
|
ఐసోలేషన్ వార్డులుగా మారిన రైలు బోగీల సంఖ్య
|
1
|
మధ్య రైల్వే
|
482
|
2
|
తూర్పు రైల్వే
|
381
|
3
|
తూర్పు మధ్య రైల్వే
|
269
|
4
|
తూర్పు తీర రైల్వే
|
262
|
5
|
ఉత్తర రైల్వే
|
897
|
6
|
ఉత్తర మధ్య రైల్వే
|
141
|
7
|
ఈశాన్య రైల్వే
|
217
|
8
|
ఈశాన్య సరిహద్దు రైల్వే
|
315
|
9
|
వాయువ్య రైల్వే
|
266
|
10
|
దక్షిణ రైల్వే
|
573
|
11
|
దక్షిణ మధ్య రైల్వే
|
486
|
12
|
ఆగ్నేయ రైల్వే
|
338
|
13
|
ఆగ్నేయ మధ్య రైల్వే
|
111
|
14
|
నైరుతి రైల్వే
|
320
|
15
|
పశ్చిమ రైల్వే
|
410
|
16
|
పశ్చిమ మధ్య రైల్వే
|
133
|
|
మొత్తం
|
5601
|
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ ప్రత్యేక రైలు పెట్టెలను, తమ సొంత వైద్య సదుపాయాలు పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి. ఈ రోజు వరకు, రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన విధంగా మొత్తం 813 బోగీలను (ఢిల్లీ - 503; ఉత్తర ప్రదేశ్ - 270; బీహార్ - 40) భారత రైల్వేలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాయి.
ఈ కోచ్‌లను కోవిడ్ కేర్ కోచ్‌లుగా మార్చడానికి, మధ్య బెర్త్‌ను తొలగించడం మరియు ఒక మరుగు దొడ్డిని, స్నానాల గదిగా మార్చడం వంటి చిన్న మార్పులు చేసి, వైద్య సదుపాయాలు మరియు ఇతర వస్తువులతో సహా అందించడం జరిగింది. సవరణలు మరియు ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతర వస్తువులతో సహా వైద్య సదుపాయాల కల్పనకు ఒక్కొక్క రైలు పెట్టెకి సగటున సుమారు 60,000 /- ఖర్చు అయ్యింది. కోవిడ్ కేర్ కోచ్ లలో ఒక్కొక్క రోగికి సగటున సుమారు 7,000 / - ఖర్చు చేసినట్లయ్యింది.
రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు, రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో, ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1656552)
Visitor Counter : 136