జౌళి మంత్రిత్వ శాఖ

మార్కెట్ తో ముడివడిన ప్రత్యేక ఉత్పత్తుల పథకం

Posted On: 18 SEP 2020 5:12PM by PIB Hyderabad

   కొన్ని ప్రత్యేక వస్తువుల ఎగుమతిని ప్రోత్సహించడానికి  ఉద్దేశించిన మార్కెట్ లింక్డ్ ప్రత్యేక ఉత్పత్తుల పథకం (ఎం.ఎల్.ఎఫ్.పి.ఎస్.) ,..2009-14 సంవత్సరాల విదేశీ వాణిజ్య విధానం నిబంధనల ప్రకారం అమలవుతూ వస్తోంది. దీన్నే 2015 మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు. 2015 సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి జరిగిన ఎగుమతులకు ఇది అమలులో లేదు. 2015-20 సంవత్సరాలకు కొత్త విదేశీ వాణిజ్య విధానం 2015 ఏప్రిల్ 1 ప్రారంభమైంది. విధానం ప్రకారం మర్కెండైజ్ ఎక్స్ పోర్ట్ ఫ్రం ఇండియా (ఎం...ఎస్.) పేరిట కొత్త పథకం మొదలైంది.

  కోవిడ్-19 వైరస్ మహమ్మారి దాడితో తీవ్రంగా దెబ్బతిన్న జవుళి పరిశ్రమను కాపాడేందుకు కేంద్ర జవుళి మంత్రిత్వ శాఖ ఒక చర్చా గోష్టిని నిర్వహించింది. జవుళి ఎగుమతి ప్రోత్సాహక మండలులు, జవుళి పరిశ్రమకు చెందిన ఇతర భాగస్వామ్యవర్గాలతో చర్చాగోష్టిని నిర్వహించారు. ఎగుమతులను పెంచదలచిన సమర్థవంతమైన జవుళి సంస్థలు, దుస్తుల తయారీ సంస్థల జాబితాను ఖరారు చేసేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగుమతికి ఆస్కారం ఉన్న ఉత్పత్తుల జాబితాను, ఆయా దేశాల్లో ఉన్న రాయబార, దౌత్య కార్యాలయాలకు పంపించారు. సంబంధిత దేశాల్లో ఉత్పత్తులను కొనుగోలు చేయగలిగే సంస్థలను గుర్తించే కసరత్తులో భాగంగా చర్య తీసుకున్నారు.

  అంతేకాక,..అంతర్జాతీయ మార్కెట్ లో అన్ని రకాల పన్నులు, ఇతక సుంకాల్లో రిబేటు ఇవ్వడం ద్వారా జవుళి పరిశ్రమను మరింత పోటీదారుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్రాల పన్నుల, లెవీల రిబేట్ పథకాన్ని (ఆర్..ఎస్.టి.సి.ఎల్.ను)కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందిఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నులు తగ్గించేవరకూ రిబేటు పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం,. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 7,398కోట్ల నిధులను రిబేటు పథకంకింద డ్యూటీ క్రెడిట్ స్క్రిప్పుల జారీకోసం  తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

  జవుళి రంగంలో ఎగుమతులను పెంచేందుకు ప్యూరిఫైడ్ టెరెఫ్తాలిక్ ఆమ్లంపై (పి.టి..పైయాంటింగ్ డంపింగ్ సుంకాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. జవుళి పరిశ్రమలో పి.టి..ని కీలకమైన ముడి పదార్థంగా వినియోగిస్తారు. వాణిజ్యంపై కోవిడ్-19 ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు జవుళి మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది. జవుళి పరిశ్రమ భాగస్వామ్య వర్గాలు ఎప్పటికప్పుడు ప్రస్తావించిన, డిమాండ్ చేసిన సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని చర్య తీసుకున్నారు.

***


(Release ID: 1656432) Visitor Counter : 107
Read this release in: English , Punjabi