జౌళి మంత్రిత్వ శాఖ
పి.పి.ఇ. సూట్ల ఎగుమతి
Posted On:
18 SEP 2020 5:10PM by PIB Hyderabad
కోవిడ్19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో, దేశంలో.వ్యక్తిగత రక్షణ పరికరసామగ్రి (పి.పి.ఇ. సూట్ల) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2020వ సంవత్సరం మేనెల మధ్యకాలం నాటికి రోజుకు 5లక్షల పి.పి.ఇ. సూట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. 2020 మార్చిలో దేశంలో పి.పి.ఇ. కిట్లు తయారీ దార్లే లేని స్థాయినుంచి, ఈ రోజుకు స్వదేశీ పరిజ్ఞానంతో కిట్లను రూపొందించే 1100 తయారీ సంస్థలను సమకూర్చుకునే స్థాయికి ప్రభుత్వం చేరుకుంది. తయారీదార్లలో ఎక్కువ సంస్థలు సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల రంగానికి చెందినవే కావడం గమనార్హం.
దేశీయ అవసరాలకు తగినన్ని పి.పి.ఇ. సూట్లను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిసరుకు దేశంలో అందుబాటులో ఉన్నందున అదనపు పి.పి.ఇ. సూట్లను ఎగుమతి చేయడానికి అనుమతి ఇవ్వాలని జవుళి పరిశ్రమ కోరింది. పరిశ్రమనుంచి వచ్చిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, ఎగుమతిపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఇందుకు సంబంధించి, విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ జనరల్ (డి.జి.ఎఫ్.టి.) 2020వ సంవత్సరం ఆగస్టు 25న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
2020వ సంవత్సరం సెప్టెంబర్ 13నాటికి తయారీదార్లు మొత్తం కోటీ 42లక్షల పి.పి.ఇ. కిట్లను మెసర్స్ హెచ్.ఎల్.ఎల్. లైఫ్ కేర్ లిమిటెడ్ సంస్థకు సరఫరా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వినియోగం కోసం పి.పి.ఇ. కిట్ల సేకరణకోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించిన ఏజెన్సీగా హెచ్.ఎల్.ఎల్. లైఫ్ కేర్ సంస్థ వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు పి.పి.ఇ. కిట్లను సరఫరా చేసే తయారీ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న జవుళి పరిశ్రమలకు చెందినవి. బెంగళూరు, తిర్పూర్, అహ్మదాబాద్, సూరత్, లూధియానా తదితర ప్రాంతాలకు చెందిన జవుళి సంస్థలు పి.పి.ఇ. కిట్లు తయారు చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకే కా, కోటికి పైగా పి.పి.ఇ. సూట్లను, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు స్వదేశీ తయారీ సంస్థలు సరఫరా చేశాయి.
పి.పి.ఇ. సూట్ల సరఫరాను క్రమబద్ధీకరించి, సరఫరాలో అడ్డంకులను తొలగించేందుకు 24గంటలూ నిర్విరామంగా పనిచేసే కేందీకృతమైన అత్యవసర కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేశారు. 200మంది నోడల్ అధికారులను ఇందుకోసం నియమించారు. తయారీ దార్లకు ముడి సరుకును సరఫరా చేయడం నుంచి, సూట్లను పరీక్షించి సర్టిఫికెట్లు జారీ చేయడం, లాక్ డౌన్ సమయంలో గమ్య స్థానానికి తుది ఉత్పత్తిని విడుదల చేయడం వరకూ ఈ వ్యవస్థే పర్యవేక్షించింది. కోవిడ్ -19 సమయంలో పి.పి.ఇ. కిట్లకు ఉన్న డిమాండ్, వాటి సరఫరా పరిస్థితిని కూడా ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తూ వస్తోంది.
కోవిడ్19నుంచి రక్షణకు ఉపయోగించే పి.పి.ఇ. సూట్లను పరీక్షించేందుకు రూపొందించిన 11 లేబరేటరీల వివరాలను అనుబంధం-Iలో చూడవచ్చు.
***
(Release ID: 1656413)
Visitor Counter : 120