శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

గత‌ మూడేళ్ల‌లో వ్యవసాయంలో బయోటెక్నాలజీ వాడకానికి మద్దతుగా రూ.310 కోట్ల‌ పెట్టుబడులు

- బయోటెక్-కిసాన్' కార్యక్రమం ద్వారా సేంద్రీయ వ్యవసాయానికీ తోడ్పాటు

- ఇరవై రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత బయోటెక్నాలజీ విధానాన్ని సిద్ధం చేసుకున్నాయి

Posted On: 18 SEP 2020 5:01PM by PIB Hyderabad

సేంద్రీయ వ్యవసాయంతో సహా వ్యవసాయ బయోటెక్నాలజీలో పోటీ ఆర్ అండ్ డీ మరియు ప్రదర్శన కార్యకలాపాల కోసం పరిశోధన సంస్థలు, కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం మద్దతునిస్తోంది. 'బయోటెక్-కృషి ఇన్నోవేషన్ సైన్స్ అప్లికేషన్ నెట్‌వర్క్'(బయోటెక్-కిసాన్) కార్యక్రమం కూడా రైతుల వ‌ద్ద‌కు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తోంది. అభిల‌ష‌నీయ‌ జిల్లాలతో సహా దేశవ్యాప్తంగా ఈ కార్యాచరణకు మంచి మద్దతు ఉంది. వ్యవసాయంలో బయోటెక్నాలజీని ఉపయోగించటానికి గత మూడేళ్లలో సుమారు రూ.310 కోట్ల‌


మేర పెట్టుబ‌డులు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో సేంద్రీయ వ్యవసాయం పెంపొందించ‌డం కూడా ఉంది. ఇరవై రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత బయోటెక్నాలజీ విధానాన్ని సిద్ధం చేసుకున్నాయి(వివరాలు అనుబంధం-I లో అందించ‌డ‌మైంది). వ్యవసాయం సహా వివిధ రంగాలలో బయోటెక్నాలజీ రంగంలో శిక్షణ పొందిన సిబ్బందిని అందించేందుకు గాను ప్ర‌భుత్వం బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ (డీబీటీ) సమగ్ర మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రోగ్రామ్, డీబీటీ-జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, డీబీటీ- రీసెర్చ్ అసోసియేట్ షిప్ మరియు డీబీటీ-బయోటెక్నాలజీ పరిశ్రమ శిక్షణా కార్యక్రమం (అప్రెంటిస్ షిప్) నైపుణ్యం మరియు శిక్షణ పొందిన మానవశక్తి కోసం ప్రోగ్రామ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మద్దతు ఉంది.

***



(Release ID: 1656412) Visitor Counter : 192


Read this release in: English , Urdu , Hindi , Punjabi