గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

వలస కార్మికులకు మరియు ఉద్యోగ కార్మికులకు జాబ్‌కార్డ్‌‌లు

Posted On: 18 SEP 2020 3:53PM by PIB Hyderabad

మహాత్మా గాంధీ ఎన్‌ఆర్ఈజీఎస్ డిమాండ్ ఆధారిత వేతన ఉపాధి పథకం. గ్రామీణ ప్రాంతంలో  జాబ్‌కార్డ్‌‌  కలిగిన‌ (మహాత్మా గాంధీ ఎన్‌ఆర్ఈజీఎస్ చట్టం ప్రకారం) ప్రతి వయోజన సభ్యుడు ఈ పథకం కింద ఉపాధి కోసం డిమాండ్ చేసేందుకు అర్హులు. ఈ పథకం కింద ఆయా వలస కార్మికులు/ కుటుంబంగా వర్గీకరించబడిన వారిని జాబ్‌కార్డ్‌‌ హోల్డర్‌గా నమోదు చేసే నిబంధన లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 86,81,928 కొత్త  జాబ్‌కార్డ్‌‌లు జారీ చేయబడ్డాయి. 2019-20 ఆర్థిక ఏడాది ఇదే కాలంలో 36,64,368 కొత్త  జాబ్‌కార్డ్‌‌లు జారీ చేయ‌బ‌డినాయి. గ‌త ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జారీ చేసిన కార్డుల సంఖ్య ఎక్కువ‌. జారీ చేసిన జాబ్‌కార్డ్‌‌ వివరాలు అనుబంధం-1లో ఇవ్వబడ్డాయి. మహాత్మా గాంధీ ఎన్‌ఆర్ఈజీఎస్ కింద‌ 2020 ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 12 వరకు క‌ల్పించ‌బ‌డిన మొత్తం వ్య‌క్తి ప‌ని దినాలు మరియు మొత్తం వేతన వ్యయాల రాష్ట్రాల వారీ వివరాలు.. అనుబంధం- II లో అందించ‌బ‌డ్డాయి. మహాత్మా గాంధీ ఎన్‌ఆర్ఈజీఎస్ డిమాండ్ ఆధారిత వేతన ఉపాధి పథకం. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వ‌యోజ‌నుల‌కు త‌గిన జీవనోపాధి భద్రతను పెంచడానికి ఈ చట్టం ఆదేశిస్తుంది. ప్రతి ఇంటికి వయోజన సభ్యుల‌కు స్వచ్ఛందంగా నైపుణ్యం అవ‌స‌రం లేని మాన‌వ సంబంధిత‌మైన ప‌నుల‌ను క‌ల్పించ‌డం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో క‌నీసం వంద రోజుల వరకు హామీ ఇచ్చే వేతన ఉపాధికి ఈ ప‌థ‌కం భరోసా క‌ల్పిస్తోంది. ఏదైనా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న మరియు నైపుణ్యం లేని శారిర‌క శ్ర‌మ‌తో కూడిన‌ పని చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఇంటిలోని వయోజన సభ్యుడు త‌మ ఇంటి నమోదు, జాబ్‌కార్డ్‌‌ పొంద‌డానికి గాను.. వారి పేరు, వయస్సు మరియు ఇంటి చిరునామాను గ్రామ స్థాయిలో వారు ఎవరి అధికార పరిధిలో నివసిస్తున్నారో సంబంధిత గ్రామ పంచాయతీకి సమర్పించవచ్చు. మహాత్మా గాంధీ ఎన్‌ఆర్ఈజీఎస్ కింద గతంలో పొందిన ఉపాధి వివ‌రాల యొక్క స‌మాచారం నిర్వహించబడదు.  
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన‌ ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అంద‌జేశారు. 

***


(Release ID: 1656304) Visitor Counter : 240


Read this release in: English , Manipuri , Punjabi , Tamil