మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్ సమయంలో మహిళలపై గృహ హింస పెరుగుదల
Posted On:
17 SEP 2020 3:57PM by PIB Hyderabad
'నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ' (నాల్సా) నుండి అందిన సమాచారం మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు 2878 గృహహింస కేసులలో న్యాయ సహాయం, ఇతర అవసరమైన సహాయం అందించబడింది. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం-2005 (పీడబ్ల్యూడీవీఏ) కింద సహాయం కోరుతూ 452 కేసులలో పిటిషన్‌లు దాఖలయ్యాయి. 694 కేసులు కౌన్సెలింగ్ / మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడ్డాయి. యూనివర్శలైజేషన్ ఆఫ్ ఉమెన్ హెల్ప్లైన్ స్కీమ్ (టోల్ ఫ్రీ టెలిఫోనిక్ షార్ట్ కోడ్ 181 ద్వారా) పరధిలోని 'వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ అండ్ ఉమెన్ హెల్ప్‌లైన్స్' (డబ్ల్యూహెచ్ఎల్) కింద ఏర్పాటు చేయబడిన 'వన్ స్టాప్ సెంటర్ల'ను (ఓఎస్‌స్సీ) లాక్‌డౌన్ సమయంలో కూడా దేశ వ్యాప్తంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇది భద్రతకు సంబంధించిన విషయాలలో మహిళలకు మద్దతు ఇస్తుంది. 25.03.2020 నాడు మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి ఒక అడ్వైజరీని కూడా జారీ చేస్తూ తగు సూచన చేసింది. ఇదే అడ్వైజరీలో గృహ హింస చట్టం-2005లో సూచించిన రక్షణ అధికారులు మరియు వరకట్న నిషేధ చట్టం-1961 ప్రకారం 'వరకట్నం నిషేధ అధికారులు' లాక్‌డౌన్ సమయంలో బాధిత మహిళలకు రక్షణ మరియు సహాయాన్ని అందించడానికి సంబంధించిన సేవలు కొనసాగించాలని ప్రత్యేకంగా ఆదేశించడమైంది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1655826)
Visitor Counter : 351