మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్‌ సమయంలో బాల్య వివాహ కేసుల్లో పెరుగుదల లేదు

Posted On: 17 SEP 2020 3:53PM by PIB Hyderabad

'నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో' (ఎన్‌సీఆర్‌బీ) నుండి అందిన స‌మాచారం మేర‌కు లాక్‌డౌన్ కాలంలో బాల్య వివాహ కేసులు పెరిగాయ‌ని సూచించేలా ఎలాంటి స‌మాచారం లేదు. ప్రభుత్వం ‘బాల్య వివాహాల నిషేధ చట్టం (పీసీఎంఏ)-2006’ ను అమలులోకి తెచ్చింది. బాల్యవివాహాల వ‌ల్ల క‌లిగే దుష్‌ప్ర‌భావాల‌ను గురించి తెలియ‌ప‌రిచేందుకు గాను అవగాహన డ్రైవ్‌లు, మీడియా ప్రచార కార్య‌క్ర‌మాలు, అవుట్‌రీచ్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. దీనికి తోడు రాష్ట్రాలు/ ‌యూటీల‌కు
స‌మ‌యానుకూలంగా బాల్యవివాహాల వ‌ల్ల క‌లిగి దుష్‌ప్ర‌భావాల‌ను గురించి తెలియ‌ప‌రిచేలా త‌గిన అడ్వ‌యిజ‌రీల‌ను జారీచేస్తూ వ‌స్తోంది. అంతేకాకుండా, కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘బేటీ బచావో బేటి పడావో (బీబీబీపీ)’ పథకాలను అమలు చేస్తుంది. దీనిలో లింగ సమానత్వానికి సంబంధించిన విషయాలపై మహిళల్లో అవగాహన కల్పించడంతో పాటుగా  బాల్యవివాహాల్ని అరిక‌ట్ట‌డం ఒక ముఖ్యమైన దృష్టి కేంద్రంగా ఉంది. 'బాల‌ల‌ హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్‌) ఈ విషయమై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాల‌ను నిర్వ‌హిస్తోంది. వాటాదారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభలకు ఇచ్చిన ఒక
లిఖితపూర్వక సమాధానంలో తెలియ‌జేశారు. 

***


(Release ID: 1655719) Visitor Counter : 138