వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

నూతన పారిశ్రామిక విధానాలు

Posted On: 16 SEP 2020 4:25PM by PIB Hyderabad

పారిశ్రామిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం ఓ వ్యూహ పత్రాన్ని తెచ్చే ప్రక్రియలో ఉంది. ఈ పత్రం దేశంలోని అన్ని వ్యాపారాలకు మార్గసూచి అవుతుంది.

 

పట్టణ వలస శ్రామికులు / పేదలు భరించగలిగిన అద్దెతో వసతి కల్పించడంకోసం కేంద్ర మంత్రివర్గం అనుమతితో ఆఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ (.ఆర్.హెచ్.సి.) పథకం 2020 జూలై 31న ప్రారంభమైంది. ఇది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (పిఎంఎవై- యు) కింద ఒక ఉప పథకం. దాని ప్రణాళిక, అమలు కోసం... అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు కార్యాచరణ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం..హెచ్.యు.)తో సంతకాల కోసం ఒక ముసాయిదా మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (ఎం..) అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్లింది. ఈ రోజు వరకు 17 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం అమలు కోసం హెచ్.యు.ఎ మంత్రిత్వ శాఖతో ఎం...పై సంతకాలుచేశాయి.

 

.ఆర్.హెచ్.సి.ల పథకం మార్గదర్శకాల ప్రకారం, లబ్దిదారుల మ్యాపింగ్ మరియు గుర్తింపు ఎంపికైన కన్సెషనరీల / సంస్థల బాధ్యత. వసతి కల్పించడానికి కన్సెషనరీలు / సంస్థలు... స్థానిక పరిశ్రమలు / తయారీదారులు / సర్వీసు ప్రొవైడర్లు / విద్యా సంస్థలు / ఆరోగ్య సంస్థలు / మార్కెట్ సంఘాలు / పట్టణ వలసదారులు, పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఇతరులతో కలసి పని చేయవచ్చు. సాధ్యమైనంత వరకు లబ్దిదారుల వేతనం / ఫీజు / ఏ విధమైన పారితోషికం నుంచైనా నేరుగా తగ్గించడం ద్వారా అద్దెను చెల్లించాలి.

 

ప్రభుత్వం అనేక రంగాల్లో ఉత్పాదకతను, నాణ్యతను పెంచడంకోసం ఉత్పత్తితో ముడిపెట్టిన రాయితీల పథకాన్ని ప్రారంభించడం, దశలవారీ తయారీ కార్యక్రమం వంటి అనేక చర్యలను చేపట్టింది. అనేక ఉత్పత్తులకు నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులను జారీ చేసింది. దేశంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు డిజిటలీకరణను కూడా అనుసరిస్తున్నాయి. ఇది ఉత్పాదకత, నాణ్యత మెరుగుదలకు తోడ్పడుతోంది.

 

ఇతరత్రా చర్యలతో పాటు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కేంద్ర కార్మిక చట్టాలను 4 ‘లేబర్ కోడ్లుగా హేతుబద్ధీకరించే ప్రక్రియలో ఉంది. అవి... వేతనాలపై కోడ్; పారిశ్రామిక సంబంధాలపై కోడ్; వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై కోడ్;  సామాజిక భద్రతపై కోడ్; ప్రస్తుతం ఉన్న కేంద్ర కార్మిక చట్టాల్లోని సంబంధిత నిబంధనలను సరళతరం, విలీనం, హేతుబద్ధీకరణ చేయడం ద్వారా ఇవి రూపొందాయి. వేతనాలపై కోడ్ ఆమోదం పొంది నోటిఫై అయింది.

ఈ సమాచారాన్ని కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు లోక్ సభలో రాతపూర్వక సమాధానంలో సమర్పించారు.

*****



(Release ID: 1655486) Visitor Counter : 148


Read this release in: Tamil , English , Manipuri , Punjabi