ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహమ్మారి వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్థిక నష్టాలు
Posted On:
16 SEP 2020 5:21PM by PIB Hyderabad
మహమ్మారి సమయంలో అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్), పి.ఎం.ఓ., సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు,పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీలో భాగంగా, పరీక్షా సదుపాయాలను పెంచడానికి, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పెంచడానికి, నిత్యావసర కార్యకలాపాలు నిర్వహించడానికి, అవసరమైన పరికరాలు, మందులు మరియు ఇతర సామాగ్రిని సేకరించడానికి రాష్ట్రాలకు సహాయం చేయడానికి నిధులు విడుదల చేయబడ్డాయి. ప్రత్యేక మరియు సమగ్ర ప్యాకేజీలు, ఆత్మ నిర్భర్ ప్యాకేజీ, మరియు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్, ఎం.ఎస్.ఎమ్.ఈ. లు మరియు ఎన్.బి.ఎఫ్.సి. లకు సహాయక చర్యలు, ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. కింద పెరిగిన కేటాయింపులు, ముద్రా రుణాల వడ్డీ మరియు పునరుద్ధరణ సామాజిక మౌలిక సదుపాయాల కోసం గ్యాప్ ఫండింగ్ పథకం అస్సాంతో సహా అన్ని ఈశాన్య రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఇంకా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన ఈశాన్య ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి (ఎన్.ఈ.సి.ఐ.డి) పథకం కింద అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో కోవిడ్ 19 తో పోరాడటానికి ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి 193.32 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో అస్సాంకు 97.48 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టుల అమలు కోసం ఇప్పటివరకు 77.33 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేశారు. ఈ మొత్తంలో 38.99 కోట్ల రూపాయలు అస్సాం కోసం కేటాయించారు. కోవిడ్-19 మహమ్మారి ని ఎదుర్కోవడంలో సహాయపడటానికి మరియు లాక్ డౌన్ సమయంలో చిక్కుకు పోయిన యువత / ఈశాన్య ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం ఈశాన్య మండలి (ఎన్.ఈ.సి), అస్సాంతో సహా అన్ని ఈశాన్య రాష్ట్రాలకు 25.29 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కరోనా మహమ్మారిపై పోరాడే చర్యలతో సహా ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాల కోసం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా, ఈశాన్య రాష్ట్రాలకు 303.40 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మొత్తంలో 191.83 కోట్ల రూపాయలు అస్సాం రాష్ట్రానికి కేటాయించారు.
<><><>
(Release ID: 1655453)
Visitor Counter : 103