వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ ప్రభావం
Posted On:
16 SEP 2020 4:31PM by PIB Hyderabad
భారతదేశపు మొత్తం ఎగుమతులు ( ఉత్పత్తులు, సేవలు) జాతీయ స్థాయి కరోనా లాక్ డౌన్ సమయం ( ఏప్రిల్-జూన్, 2020 ) లో గణనీయంగా పడిపోయాయి. నిరుడు ఇదే కాలంతో పోల్చినప్పుడు ఈ తగ్గుదల 25.42% గా నమోదైంది. తాజాగా నమోదైన ఉత్పత్తుల ఎగుమతులు గమనించినప్పుడు పరిశ్రమల కార్యకలాపాల పునరుద్ధరణ ప్రారంభమైనట్టు కనబడుతోంది. గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ జూన్ నెలకు గాను వేసిన అంచనా ప్రకారం పరిశ్రమల ఉత్పత్తి సూచికను గమనిస్తే ఏప్రిల్ లో 53.6 , మే నెలలో 89.5 ఉండగా అది జూన్ నాటికి 107.8 కి చేరింది.
ఎగుమతులను పెంచటానికి ప్రభుత్వం ఈ దిగువ పేర్కొన్న చర్యలు తీసుకుంది:
* విదేశీ వర్తక విధానం 2015-20 కోవిడ్- 19 కారణంగా మరో ఏడాదిపాటు... అంటే, 31-3-2021 దాకా కొనసాగేటట్టు మినహాయింపులు ఇచ్చింది.
* ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ కింద ఎగుమతుల మీద ఇచ్చే ఋణాన్ని మరో ఏడాది పాటు అంటే 31-3-2021 దాకా పొడిగించటం
* సంబంధిత మంత్రిత్వశాఖలు ఆయా రంగాలవారీ రాయితీ పాకేజీలు ప్రకటించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వశాఖ ఇచ్చిన ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకాలు, ఫార్మా రంగానికి ఇచ్చిన పి ఎల్ ఐ పథకం, ఔషధాల తయారీకి అవసరమైన ఎపిఐ ల తయారీదారులకు ప్రోత్సాహకాలు
* ఎగుమతి దారులు ఎఫ్ టి ఎ వాడుకోవటానికి ఉత్పత్తి స్థానం ధృవపత్రాల జారీకోసం ఉమ్మడి డిజిటల్ వేదిక
* సమగ్రమైన వ్యవసాయ ఎగుమతి విధానం అమలు ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు అవకాశం. అందులో వ్యవసాయ, ఉద్యానవన, పశుగణాభివృద్ధి, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలున్నాయి.
* 12 ఛాంపియన్ సేవా రంగాల కోసం నిర్దిష్టమైన కార్యాచరణ పథకాల ద్వారా వైవిధ్యభరితమైన సేవల ఎగుమతులను ప్రోత్సహించటం
* ఆయా జిల్లాలలో ఎగుమతులకు అవకాశమున్న ఉత్పత్తులను గుర్తించి వాటిని ప్రోత్సహించటం, ఎగుమతులకున్న అవరోధాలను తొలగించటం, స్థానిక ఎగుమతుదారులకు, ఉత్పత్తిదారులకు మద్దతు ఇవ్వటం ద్వారా జిల్లాల్లో ఉపాధి అవకాశాలు సృష్టించటం
* వస్తువులు, సేవలు, నైపుణ్యాల తప్పనిసరి సాంకేతిక ప్రమాణాలను అనుసరించటం, అమలు చేయటానికి అవసరమైన పరిస్థితిని బలోపేతం చేయటం
* మన వర్తకం, పర్యాటజం, టెక్నాలజీ, పెట్టుబడి లక్ష్యాలకోసం విదేశాల్లోని భారత మిషన్స్ ను శక్తిమంతం చేయటం
బాంకింగ్, ఆర్థిక రంగం ద్వారా స్వదేశీ పరిశ్రమకు మగ్దతుగా ఇచ్చిన సహాయం సహా ప్రకటించిన పాకేజ్, మరీ ముఖ్యంగా ఎగుమతులలో ఎక్కువ వాటా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహాపరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం.
వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ సమాచారాన్ని లోక్ సభకు లిఖితపూర్వక సమాధానంగా ఇచ్చారు.
***
(Release ID: 1655447)