వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కరోనావైరస్ ప్రభావం
प्रविष्टि तिथि:
16 SEP 2020 4:22PM by PIB Hyderabad
ఆకస్మికంగా దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అత్యంత ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచమంతటా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, భారత్ సహా అనేక ప్రధాన దేశాలను అతలాకుతలం చేసింది. లాక్ దౌన్ విధించిన కారణంగా అంతర్జాతీయంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి కుంచించుకు పోయిందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేశాయి. భారత్ లో దేశమంతటా లాక్ డౌన్ విధించిన ఫలితంగా అనేక రంగాలు దెబ్బతిన్నాయి. అయితే, లాక్ డౌన్ నిబంధనలు సడలించే కొద్దీ వివిధ రంగాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది.
పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసింది. వాటి వివరాలు:
(i) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊరటనిచ్చే చర్యలు తీసుకుంది. 100 శాతం రుణ హామీతో తనఖాలేవీ అవసరంలేని రుణాలివ్వటం, నాన్ బాంకింగ్ ఫైనాస్ కంపెనీలకు అప్పులిచ్చిన బాంకులకు పాక్షిక ఋణహామీ పథకం అమలు చేయటం, ఖాయిలా పడ్డ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అదనపు ఋణాలిచ్చి నిలబెట్టటం, గృహ ఋణాల సంస్థలకు, సూక్ష్మ రుణాల సంస్థలకు అప్పులివ్వటం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో వాటాలు కొనుగోలు చేయటం ద్వారా పెట్టుబడి సమకూర్చటం, రాయితీతో కూడిన అప్పు ద్వారా రైతులకు సాయమందించటం, వీధి వర్తకులకోసం ఋణ సౌకర్యం (పిఎం స్వనిధి) లాంటి ఎన్నో పథకాలు ప్రభుత్వం అందుబాటు లోకి తెచ్చింది.
(ii) నియంత్రణా పరమైన మినహాయింపులు: పన్ను రిటర్న్ లు దాఖఅలు చేయాల్సిన సమయం పొడిగింపు, చట్ట ప్రకారం దాఖలు చేయాల్సిన పత్రాలకు గడువు పెంపు, గడువు మీరిన జీ ఎస్టీ చెల్లింపులమీద వడ్డీ మినహాయింపు, ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ విధానంలో నియమాల సడలింపు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ బకాయిల చెల్లింపు వేగవంతం చేయటం. ఐబిసి సంబంధమైన మినహాయింపులు అందులో ఉన్నాయి.
(iii) ఆత్మ నిర్భర్ పాకేజ్ లో భాగంగా ప్రకటించిన నిర్మాణాత్మక సంస్కరణలలో భాగంగా వ్యవసాయరంగంలో నియంత్రణల తొలగింపు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వచనంలో మార్పు, ప్రభుత్వ రంగ సంస్థలకు కొత్త విధానం, బొగ్గు గని త్రవ్వకాలను వాణిజ్యపరం చేయటం, రక్షణ, అంతరిక్ష రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంచటం, పరిశ్రమలకోసం భూమిని అభివృద్ధి చేయటం, లాండ్ బ్యాంక్ సిద్ధం చేయటం, పారిశ్రామిక సమాచార వ్యవస్థ ఏర్పాటు, సామాజిక మౌలిక సదుపాయాలకు వయబిలిటీ గాప్ ఫండింగ్ ను సమూలంగా మార్చటం, కొత్త విద్యుత్ టారిఫ్ విధానం, రంగాలవారీ సంస్కరణలు చేపట్టటానికి రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వటం లాంటివి ఇందులో ఉన్నాయి.
(iv) ఉద్యోగి భవిష్యనిధి చెల్లింపుల తగ్గింపు, వలస కార్మికులకు ఉపాధి కల్పన, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నవారికి బీమా కల్పన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనాల పెంపు, భవన నిర్మాణ కార్మికులకు మద్దతు, స్వయం సహాయక బృందాలకు హామీ అవసరంలేని ఋణాలు లాంటివి ఎన్నో ప్రకటించారు. జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకాల పథకాలు ప్రకటించటంతోబాటు కేంద్రీకృత పెట్టుబడుల క్లియరెన్స్ విభాగాల ద్వారా పెట్టుబడులకు మద్దతు నివ్వటం కూడా ఇందులో ఉన్నాయి.
కోవిడ్-19 విసిరిన సవాలుకు భారత్ సానుకూలంగా స్పందించింది. భారత తయారీదారులు పిపిఇ కిట్లు, ఎన్ 95/ ఎన్99 మాస్కుల తయారీ, హెచ్ సి క్యూ ఔషధాలతయారీ, ఆక్సిజెన్ సిలిండర్ల తయారీ పెద్ద ఎత్తున పెంచటం ద్వారా స్వదేశీ అవసరాలు తీర్చటంతోబాటు ఎగుమతుల ద్వారా విదేశాల అవసరాలు కూడా తీర్చగలిగారు. కోలుకోవటంలో భారత ఆర్థిక వ్యవస్థ పెట్టింది పేరు. అందుకే వచ్చే కొద్ది నెలల్లోనే మళ్ళీ యథాస్థితికి వచ్చే ప్రయత్నం జరుగుతోంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ సమాచారాన్ని లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంగా ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 1655172)
आगंतुक पटल : 260