రైల్వే మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 21, 2020 నుంచి 20 జతల క్లోన్ స్పెషల్ రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ
ఈ రైళ్ల అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు 10 రోజులు
19 జతల క్లోన్ రైళ్లకు హమ్ సఫర్ బోగీలు, 1 జత రైళ్లకు జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ బోగీల వినియోగం
Posted On:
15 SEP 2020 8:18PM by PIB Hyderabad
దేశంలోని కొన్ని ప్రత్యేక రూట్లలో రైళ్లకు గల భారీ డిమాండును పరిగణనలోకి తీసుకుని 21 సెప్టెంబర్ 2020 నుంచి 20 క్లోన్ స్పెషల్ రైళ్లు నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇవి పూర్తిగా రిజర్వ్ డ్ బోగీలతో, ప్రకటిత సమయాల్లో మాత్రమే నడుస్తాయి. ఏయే స్టేషన్లలో ఆగాలనేది కూడా నిర్వహణాపరమైన స్టేషన్ల వరకే పరిమితం.
వీటిలో 19 జతల రైళ్లకు హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైళ్ల బోగీలను ఉపయోగించుకుంటారు. లక్నో-ఢిల్లీ మధ్య నడిచే 1 జత క్లోన్ స్పెషల్ రైళ్లకు (04251/04252) జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ బోగీలు ఉపయోగించుకుంటారు. హమ్ సఫర్ బోగీలతో నడిచే రైళ్ల చార్జీలు హమ్ సఫర్ రైలు చార్జీలతో సమానంగా ఉంటాయి. జన శతాబ్ది బోగీలతో నడిచే రైళ్లకు జనశతాబ్ది రైలు చార్జీలు వసూలు చేస్తారు. ఈ రైళ్లకు ఎఆర్ పి (అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి) 10 రోజులుంటుంది.
ఇప్పటికే వివిధ రూట్లలో నడుస్తున్న స్పెషల్ రైళ్లకు ఇవి అదనంగా నడుస్తాయి.
***
(Release ID: 1654906)
Visitor Counter : 216