పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
పంచాయతీ భవనాల నిర్మాణం
प्रविष्टि तिथि:
15 SEP 2020 8:03PM by PIB Hyderabad
పంచాయతీ రాజ్ వ్యవస్థ రాష్ట్రం పరిధిలోని అంశం కాబట్టి, గ్రామ పంచాయతీలో పంచాయతీ భవనం నిర్మాణం ప్రధానంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే అవుతుంది. పంచాయతీ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్రాలే వివిధ వనరులనుంచి సమకూర్చుకోవలసి ఉంటుంది. అయితే,..ఈ విషయంలో రాష్ట్రాల ప్రయత్నాలకు తోడుగా, పంచాయతీ భవనాల నిర్మాణానికి గాను, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర పంచాయతీ మంత్రిత్వ శాఖ వివిధ పథకాల ద్వారాఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. కేంద్రం సౌజన్యంతో నడిచే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్.జి.ఎస్.ఎ.) 2018-19వ సంవత్సరంనుంచి అమలవుతూ వస్తోంది. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి పరిమిత స్థాయిలో అంటే భవనానికి 20లక్షల రూపాయల చొప్పున రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించేందుకు ఆర్.జి.ఎస్.ఎ. వీలు కల్పిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే, 4,500 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం లభించింది. వివిధ రకాల పథకాల కింద నిర్మించే గ్రామ పంచాయతీ భవనాల వివరాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాగాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 2,56,765 గ్రామపంచాయతీలు, గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు గాను, 1,97,108 గ్రామ పంచాయతీలకు మాత్రమే పంచాయతీ భవనాాలు ఉన్నాయి. 59,657 గ్రామ పంచాయతీలు పంచాయతీ భవనాలు లేకుండానే పరిపాలన సాగిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన రాష్ట్రాలవారీ వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.
ఈ పరిస్థితి దృష్ట్యా,.. గ్రామపంచాయతీలకు పంచాయతీ భవనాల అవసరాన్ని, ఆర్.జి.ఎస్.ఎ. కింద నిధులకు ఉన్న పరిమితిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ భవనాల నిర్మాణం జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అంతేకాక, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.) కింద నిధులను, వనరుల మార్పుదల ద్వారా, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. 14వ ఆర్థిక సంఘం కింద ఖర్చు పెట్టని నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను, రాష్ట్రాల పథకాలకింద నిధులను ఇందుకోసం ఖర్చు పెడుతున్నారు. తద్వారా పంచాయతీ భవనాల నిర్మాణంలో అవసరానికి, వాస్తవానికి మధ్య అంతరాన్ని 2022వ సంవత్సరం ఆఖరునాటికల్లా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఈ సమాచారాన్నితెలిపారు.
*******
(रिलीज़ आईडी: 1654899)
आगंतुक पटल : 167