గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్

Posted On: 15 SEP 2020 7:32PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిని సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చిన వలస కూలీల సమస్యలను పరిష్కరించేందుకు, అలాంటి నష్టాలనే ఎదుర్కొన్న గ్రామీణ ప్రజలకు అండగా నిలిచేందుకు గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ (జి.కె.ఆర్..) పేరిట 125 రోజుల పథకాన్ని గౌరవ ప్రధానమంత్రి 2020 జూన్ నెలలో ప్రకటించారు. కోవిడ్ కారణంగా కష్టాల్లో చిక్కుకున్న వారికి బహుముఖ వ్యూహం ద్వారా వెంటనే ఉపాధి, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, ప్రజా మౌలిక సదుపాయాలు, జీవనోపాధి ఆస్తులు సృష్టించి ఆదాయం సృష్టి కార్యకలాపాలను ప్రోత్సహించి గ్రామాలను సంతృప్త స్థాయిలో ఆదుకోవడం కార్యక్రమ లక్ష్యంగా నిర్దేశించారు. అంతేకాకుండా, ఆరు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 116 జిల్లాల్లో 25 పనులపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా దీర్ఘకాలిక జీవనోపాధికి అవకాశాలు కల్పించడం, ఇందుకోసం రూ.50వేల కోట్ల వనరులను సృష్టించాలన్నది కూడా పథకం లక్ష్యంగా నిర్ణయించారు.

   రాష్ట్రాలవారీగా పనిదినాల రూపంలో సృష్టించిన ఉపాధి అవకాశాలు, గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద ఇప్పటివరకూ ఖర్చు పెట్టిన మొత్తం వివరాలు కింది విధంగా ఉన్నాయి:

వరుస సంఖ్య

 

 

రాష్ట్రం పేరు

 

సృష్టించిన ఉపాధి పనిదినాలు

 

ఖర్చు (కోట్ల రూపాయల్లో)

 

1

బీహార్

 

4,24,61,946

6,712.82

2

జార్ఖండ్

 

40,10,287

662.24

3

మధ్యప్రదేశ్

 

4,77,87,323

4,233.49

4

ఒడిశా

 

74,42,323

1,000.84

5

రాజస్థాన్

 

11,13,43,237

6,044.25

6

ఉత్తరప్రదేశ్

5,90,72,124

4905.56

 

 

మొత్తం

27,21,17,240

23,559.20

 

లక్ష్యాల సాధనలో పథకం ఇప్పటివరకూ విజయవంతంగానే సాగింది. సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు, గ్రామీణ ప్రాంతాల్లో అదే తరహాలో దెబ్బతిన్న పౌరులకు జీవనోపాధి కల్పించడం పథకం లక్ష్యం. ఇప్పటివరకూ పథకం కింద 27.21 కోట్ల పనిదినాల ఉపాధి కల్పన జరిగింది.

  

పథకం లక్ష్యాల సాధనకోసం జరిగిన కృషిలో భాగంగా, ఇప్పటి వరకూ అనేక కట్టడాలు, సదుపాయాలు  నిర్మించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

వరుస సంఖ్య

చేపట్టిన కార్యక్రమాలు

 

1

సామాజిక పారిశుద్ధ్య భవన సముదాయాలు (సంఖ్య)

6,655

2

గ్రామీణ ఇళ్లు (సంఖ్య)

3,21,058

3

పశువుల కొట్టాలు (సంఖ్య)

23,705

4

పొలం కుంటలు (సంఖ్య)

16,571

5

మేకల షెడ్లు (సంఖ్య)

4,856

6

నీటి సంరక్షణ, నీటి పొదుపు పనులు (సంఖ్య)

1,01,094

7

మొక్కలు నాటడం (కాంపా -సి..ఎం.పి.. నిధులతో జరిగిన వాటితో సహా)

72,748 హెక్టార్లు

8

శ్యామ ప్రసాద్ ముఖర్జీ రుర్బాన్ మిషన్ కార్యక్రమాలు (సంఖ్య)

6,759

9

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణా పనులు (సంఖ్య)

16,219

10

గ్రామపంచాయతీ భవనాలు (సంఖ్య

1,063

11

భారత్ నెట్ కార్యక్రమం కింద ఇంటర్నెట్ తో అనుసంధానమైన గ్రామపంచాయతీలు (సంఖ్య)

1,254

  

  పథకం కింద చేపట్టే పనుల ప్రగతిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మరో 11 భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వస్తున్నాయి. పథకం అమలు జరుగుతున్న ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ తరఫున నోడల్ అధికారిని నియమించారు. పథకం పర్యవేక్షణలో జిల్లాలకు, మార్గదర్శకత్వం వహించి, సహాయం అందించేందుకు నోడల్ అధికారి నియామకం జరిగింది. పథకం అమలును సులభతరం చేసేందుకు వివిధ రాష్ట్రాలతో, మంత్రిత్వ శాఖలతో ఎప్పటికప్పుడు చర్చలు, సంప్రదింపులను కూడా అధికారులు చేపట్టారు.

పథకం ద్వారా వివిధ రాష్ట్రాల్లో కల్పించిన ఉపాధి కల్పన పనిదినాల వివరాలు కింది విధంగా ఉన్నాయి:

వరుస సంఖ్య

రాష్ట్రం పేరు

సృష్టించిన ఉపాధి పనిదినాలు

 

1

బీహార్

4,24,61,946

2

జార్ఖండ్

4,0,10,287

3

మధ్యప్రదేశ్

4,77,87,323

4

ఒడిశా

74,42,323

5

రాజస్థాన్

11,13,43,237

6

ఉత్తరప్రదేశ్

5,90,72,124

 

మొత్తం

27,21,17,240

 

గ్రామీణ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్  కింద వనరులుగా సృష్టించిన రూ. 50వేల కోట్లలో రాష్ట్రాలవారీగా చేసిన ఖర్చు వివరాలు కింది విధంగా ఉన్నాయి:

వరుస సంఖ్య

రాష్ట్రం పేరు 

ఖర్చు (రూ. కోట్లలో)

1

బీహార్

6,712.82

2

జార్ఖండ్

662.24

3

మధ్యప్రదేశ్

4,233.49

4

ఒడిశా

1,000.84

5

రాజస్థాన్

6,044.25

6

ఉత్తరప్రదేశ్

4,905.56

 

 

మొత్తం

23,559.20

 

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో సమాచారం వెల్లడించారు.

*******


(Release ID: 1654896) Visitor Counter : 274


Read this release in: English , Manipuri , Punjabi