ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచ బ్యాంకు భారతదేశానికి అందించిన రుణం వివ‌రాలు

Posted On: 15 SEP 2020 6:04PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మహమ్మారి నియంత్ర‌ణ‌కు త‌గు విధంగా స్పందించేందుకు గాను ప్రపంచ బ్యాంకు ఇప్పటి వరకు 2.5 బిలియన్ డాల‌ర్ల విలువైన రుణాన్ని 3 విడ‌త‌లుగా భారత ప్రభుత్వానికి అందించింది. ఆరోగ్యానికి (1 బిలియన్ డాల‌ర్లు ), సామాజిక రక్షణ కోసం (0.75 బిలియన్ డాల‌ర్లు) మరియు ఆర్థిక ఉద్దీపనకు (0.75 బిలియన్ డాలర్ల‌) రుణాన్ని అంద‌జేసింది. వీటి ప్ర‌యోజనాలు అన్ని రాష్ట్రాలు, యూటీలకు లభించాయి. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మంత్రి శ్రీ ఠాకూర్ తెలియజేస్తూ.. ఆరోగ్య చర్యలకు సంబంధించి 1,000 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన మొద‌టి రుణానికి సంబంధించి ఏప్రిల్ 3వ తేదీ 2020న సంత‌కం చేయ‌బ‌డింద‌ని తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి వల్ల కలిగే ముప్పును గుర్తించడానికి, నివారించడానికి, ప్రతిస్పందించడానికి మరియు ప్రజారోగ్య సంసిద్ధత కోసం జాతీయ వ్యవస్థలను బలోపేతానికి.. భారత ప్రభుత్వం యొక్క రూ.15,000 కోట్ల కోవిడ్‌ ఆరోగ్య చర్యల‌కు కొంత ఆర్థిక తొడ్పాటుకు వీలుగా ఈ రుణం తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ రోజు వ‌ర‌కు రుణంలో 502.5 మి. డాల‌ర్ల మేర రుణం పంపిణీ చేయబ‌డింది. సామాజిక రక్షణ చర్యలకు సంబంధించిన 750 మి. డాలర్ల విలువైన రెండో రుణ ప‌త్రంపై మే 15, 2020న‌ సంత‌కం చేయ‌డ‌మైంది. 'భారతదేశపు కోవిడ్‌-19 సామాజిక రక్షణ ప్రతిస్పందన కార్యక్రమాన్ని వేగవంతం చేయడం' కోసం.. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) లబ్ధిదారులకు సహాయక చర్యలకు గాను బడ్జెట్ మద్దతుగా నిలిచేలా ఈ రుణం తీసుకోవ‌డ‌మైంది. ఇప్ప‌ట‌కే ఈ రుణం పూర్తిగా పంపిణీ చేయ‌డ‌మైంది. 750 మిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ఉద్దీపన చర్యలకు సంబంధించిన మూడవ రుణం కోసం జూలై 6, 2020 న సంతకం చేయబడింది. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ (ఏఎన్‌బీపీ) కింద ఎంఎస్ఎంఈలకు త‌గు మద్దతు ఇచ్చే కార్య‌క్ర‌మానికి బ‌డ్జెట‌రీ మ‌ద్ద‌తు అందించేందుకు  ఈ రుణం స‌మీక‌రించడ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రుణాన్ని పూర్తిగా పంపిణీ చేయ‌డ‌మైంది.
                                 

****


(Release ID: 1654772) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Manipuri , Kannada