వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పాదరక్షలు మరియు తోలు పరిశ్రమ కోసం అభివృద్ధి మండలి ఏర్పాటు

Posted On: 15 SEP 2020 6:18PM by PIB Hyderabad

పాదరక్షలు మరియు తోళ్ళ పరిశ్రమ అభివృద్ధి మండలి (డి.సి.ఎఫ్.ఎల్) ను ఏర్పాటు చేస్తూ, పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య అభివృధి శాఖ (డి.పి.ఐ.ఐ.టి) ఒక ప్రకటన విడుదల చేసింది.  డి.సి.ఎఫ్.ఎల్. చైర్మన్ గా శ్రీ ఆర్.కె.గుప్త రెండేళ్లు వ్యవహరిస్తారు.   మరో 24 మంది సభ్యులుగా కూడా నియమితులయ్యారు.  

భారతదేశంలో కార్మికులు తయారుచేసే పాదరక్షలు మరియు తోలు రంగాల వృద్ధికి ప్రచారం మరియు అభివృద్ధి చర్యలను రూపొందించడం మరియు అమలు చేయడం కోసం పాదరక్షలు మరియు తోలు పరిశ్రమల అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు.  దేశీయ ఉత్పత్తిని పెంచడానికి మరియు ఎగుమతులను ప్రోత్సహించడానికీ, అదేవిధంగా భారతదేశంలో అధిక నాణ్యత కలిగిన ప్రపంచ స్థాయి పాదరక్షలు మరియు తోలు ఉత్పత్తుల అభివృద్ధి, రూపకల్పన మరియు తయారీకి అవసరమైన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేయడంలో అభివృద్ధి మండలి చాలా చురుకైన పాత్ర పోషించనుంది. 

భారత గెజిట్ లో ప్రచురించిన ఆదేశాల నకలు జతచేయబడింది.

*****(Release ID: 1654743) Visitor Counter : 55


Read this release in: English , Urdu , Hindi