మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
‘జాతీయ మత్స్య విధానం (2020)’
Posted On:
15 SEP 2020 5:16PM by PIB Hyderabad
'నేషనల్ పాలసీ ఆన్ మెరైన్ ఫిషరీస్-2017' (ఎన్‌పీఎంఎఫ్), 'డ్రాఫ్ట్ నేషనల్ ఇన్‌లాండ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ పాలసీ' (నిఫాప్), 'డ్రాఫ్ట్ నేషనల్ మారికల్చర్ పాలసీ' (ఎన్‌ఎమ్‌పీ) లను సమీకృతం చేయడం ద్వారా సమగ్రమైన 'జాతీయ మత్స్య విధానం-2020'ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంట కాలము తరువాత అంశాలతో కూడిన ఎన్‌పీఎంఎఫ్‌తో కలుపుకొని 'జాతీయ మత్స్య విధానం-2020'ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీరప్రాంత ఆక్వాకల్చర్‌ను నియంత్రించేలా మార్గదర్శకాలను 'కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ యాక్ట్ -2005'లోని 'కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ రూల్స్- 2005' ప్రకారం జోడించబడ్డాయి. వీటిలో పర్యావరణ ప్రభావ అంచనా, పర్యావరణ పర్యవేక్షణ మరియు నిర్వహణ ప్రణాళిక, వ్యర్థ నీటి నిర్వహణ మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరించడం, తీరప్రాంతాలలో పర్యావరణ బాధ్యత మరియు సామాజికంగా ఆమోదించబడిన ఆక్వాకల్చర్‌ను నిర్ధారించడానికి మరియు సమీకృత తీరప్రాంత నిర్వహణ వంటి వివిధ చర్యలను ఇది అందిస్తోంది.
మత్స్యకారులకు ఆర్థిక సహాయం..
దేశంలో మత్స్య రంగానికి ప్రత్యేకమైన కొత్త పథకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ కోవిడ్-19 రిలీఫ్ ప్యాకేజీ కింద ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన'(పీఎంఎంఎస్‌వై) పథకంను ప్రకటించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) దాని వివిధ విభాగాల ద్వారా చేపల కార్మికులతో సహా సాంప్రదాయ మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మత్స్య వనరుల పరిరక్షణ కోసం ఫిషింగ్ నిషేధం/ లీన్ సమయంలో సామాజికంగా-ఆర్ధికంగా వెనుకబడిన చురుకైన సంప్రదాయాక మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి మరియు పోషక మద్దతుతో సహా పథకంలో నమోదు చేయబడిన వివిధ కార్యకలాపాలకు ప్రభుత్వం ఈ పథకం కింద తగిన సాయం అందించనుంది.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి పార్లమెంట్‌కు అందించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియ జేశారు.
***
(Release ID: 1654737)
Visitor Counter : 241