సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ, బలహీన వర్గాల విద్యార్థుల విదేశీ చదువులకు ఉపకార వేతనాలు

Posted On: 15 SEP 2020 4:53PM by PIB Hyderabad

విదేశాల్లో చదువులకోసం ప్రభుత్వం రెండు పథకాలను అమలు చేస్తోంది:

  1. షెడ్యూల్డ్ కులాలు, తదితరులకు విదేశాల్లో విద్యాభ్యాసానికి ఇచ్చే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్ షిప్... షెడ్యూల్డ్ కులాలు, డీ నోటిఫైడ్ సంచార జాతులకు, ఒక మోస్తరు సంచార జాతులకు, భూమిలేని వ్యవసాయ కూలీలు, సాంప్రదాయ చేతి వృత్తులవారు తదితర అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థుల విదేశీ చదువులకోసం ఉపకార వేతనాన్ని రూపొందించారు. వారు మాస్టర్స్ డిగ్రీ స్థాయి, పి.హెచ్.డి వంటి ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు స్కాలర్ షిప్ దోహదపడుతుంది. నిధుల అందుబాటు పరిస్థితిని బట్టి ప్రతియేటా వందమందికి స్కాలర్ షిప్పులు మంజూరు చేస్తారు. 30 శాతం స్కాలర్ షిప్పులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు. విద్యాసంస్థలు వసూలు చేసే వాస్తవ బోధనారుసుం, నిర్వహణా భత్యం, విమాన ప్రయాణం చార్జీలు, వీసా ఫీజు, బీమా ప్రీమియం, వార్షిక కంటింజెన్సీ భత్యం, ఆవశ్యకమైన ప్రయాణ అలెవెన్స్ లను విద్యార్థులకు చెల్లించడానికి స్కాలర్ షిప్ వీలు కలిగిస్తుంది.

 

2. వడ్డీ సబ్సిడీ సదుపాయాన్ని అందించే డాక్టర్ అంబేద్కర్ కేంద్ర పథకం...ఇతర వెనుకబడిన తరగుతులు (.బి.సి.), ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (.బి.సి.) విద్యార్థులు విదేశాల్లో విద్యాభ్యాసం సాగించడానికి కోర్సు సమయంలోను, అనంతరం ఉద్యోగం వచ్చిన తర్వాత సంవత్సరం, లేదా ఆరునెలల్లో తీసుకునే విద్యా రుణాలకు గాను వడ్డీ సబ్సిడీ సదుపాయాన్ని పథకం అందిస్తుంది

 

రెండు పథకాలకు నిబంధనలు/ అర్హతా ప్రమాణాలు విధంగా ఉంటాయి:

  1. ఎస్సీ అభ్యర్థులకోసం నేషనల్ ఓవర్సీస్ పథకం: పథకం కింద ఉపకార వేతనం కోరే అభ్యర్థుల వయస్సు వారు ఎంపిక చేసుకున్న (దరఖాస్తు చేసుకున్న) సంవత్సరం ఏప్రిల్ 1 తేదీ నాటికి 35ఏళ్లు మించరాదు. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ కోసం స్కాలర్ షిప్ విషయంలో అయితే, కనీసం గ్రాడ్యుయేషన్ అర్హత, 60శాతం మార్కులు సాధించి ఉండాలి. పి.హెచ్.డి. కోసం అయితే, కనీస అర్హత మాస్టర్స్ డిగ్రీ, 60శాతం మార్కులు ఉండాలి. అన్ని మార్గాలద్వారా కుటుంబ వార్షికాదాయం 8లక్షల రూపాయలకు మించరాదు. కుటుంబంలో ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉండరాదు.

 

  1. డాక్టర్ అంబేద్కర్ కేంద్ర పథకం: ఇతర వెనుకబడిన తరగతులు (.బి.సి.లు), ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (.బి.సి.లకు) చెందిన విద్యార్థులు విదేశాల్లో చదువుకోసం తీసుకునే విద్యారుణాలకు వడ్డీపై సబ్సిడీ సదుపాయం కల్పించే పథకం కింద మాస్టర్స్ డిగ్రీ చదువుకునే వారికి, పిహెచ్.డి చదువుకు ప్రయోజనం కలిగిస్తారు. అన్ని ఆదాయ మార్గాల ద్వారా (తల్లిదండ్రుల ఆదాయం, స్వయం ఉపాధి ద్వారా వచ్చే ఆదాయం) కుటుంబ వార్షిక ఆదాయం 8లక్షల రూపాయలకు మించరాదు.

కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ రోజు లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వివరాలు తెలియజేశారు.

***


(Release ID: 1654728)
Read this release in: English , Punjabi