సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
షెడ్యూల్డ్ కులాల కోసం అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక
Posted On:
15 SEP 2020 4:55PM by PIB Hyderabad
సమాజంలోని అన్ని వర్గాలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక-ఆర్థిక వ్యూహంలో భాగంగా, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి తగిన నిధులు ఇవ్వడం జరిగింది. దీనిని "డెవలప్‌మెంట్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్సీస్" (డీఏపీఎస్‌సీ- తొలుత ఎస్‌సీఎస్‌పీగా పిలిచారు) రూపంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీనివల్ల, లక్ష్యంగా నిర్దేశించిన ఆర్థిక, ఇతర ప్రయోజనాలు షెడ్యూల్డ్ కులాలకు అందుతాయి. డీఏపీఎస్‌సీ కింద, ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమం కోసం పథకాల అమలుకు నిర్దేశిత శాతంలో నిధులను మంత్రిత్వ/విభాగాలు కేటాయించాయి. ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం, ఎస్సీలకు కేటాయించిన నిధులను ఎస్సీయేతర కార్యక్రమాలకు తిరిగి కేటాయించబడవు. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తమ బడ్జెట్‌లో కొంత భాగాన్ని ఎస్సీల అభివృద్ధికి కేటాయిస్తున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌తో కలిపి దేశంలో ఎస్సీల జనాభా 20.14 కోట్లు. ఇది మొత్తం దేశ జనాభాలో 16.6 శాతం. డీఏపీఎస్‌సీ కింద రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు నిబంధన లేదు. అయితే, గత
మూడేళ్ళతోపాటుప్రస్తుత సంవత్సరంలో డీఏపీఎస్‌సీ కింద వివిధ పథకాల రూపంలో కేటాయించిన మొత్తం నిధుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం
|
2017-18
|
2018-19
|
2019-20
|
2020-21
|
డీఏపీఎస్‌సీ కేటాయింపులు రూ.కోట్లలో
|
52605.81
|
56618.25
|
81340.74
|
83256.62
|
డీఏపీఎస్‌సీ కేటాయింపులు ఏటికేడాది పెరుగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఉన్న ఎస్సీల జనాభా శాతం కంటే, గుర్తించిన పథకాల ద్వారా ఇచ్చిన మొత్తం కేటాయింపుల్లో డీఏపీఎస్‌సీ కేటాయింపుల శాతం ఎక్కువ.
డీఏపీఎస్‌సీ ఆర్థిక, భౌతిక, ఫలితాల లక్ష్యాల పర్యవేక్షణ కోసం ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ (e-utthaan.gov.in)ను సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని మెరుగ్గా పర్యవేక్షించడానికి సంబంధింత విభాగాలు లేదా మంత్రిత్వ శాఖలు నోడల్ అధికారులను నియమించాయి. నిధులను సరిగా వినియోగించేలా, సంబంధిత విభాగాలు, మంత్రిత్వ శాఖలతో సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తరచూ సమావేశాలు నిర్వహిస్తోంది.
సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.
***
(Release ID: 1654726)