ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి సమయంలో పెరిగిన మానసిక ఆరోగ్య సమస్యలు
Posted On:
15 SEP 2020 3:03PM by PIB Hyderabad
పిల్లలతో సహా ప్రజల మానసిక ఆరొగ్యంపై కోవిడ్ -19 ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని , కోవిడ్ 19 సమయంలో మానసికపరమైన మద్దతు నిచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఈ చర్యలలో భాగంగా బాధిత ప్రజలు పిల్లలు, పెద్దలు, వయోధికులు, మహిళలు, ఆరోగ్య కార్యకర్తల వారీగా వివిధ టార్గెట్ గ్రూప్‌లకు ఆరోగ్య నిపుణులచే 24 గంటల హెల్ప్‌లైన ఏర్పాటు ద్వారా మానసిక పరమైన మద్దతు ఇవ్వడం జరుగుతోంది.
సమాజంలోని వివిధ వర్గాల వారికి మానసిక ఆరోగ్య సమస్యల నిర్వహణకు సంబందించిన మార్గదర్శకాలు, సూచనలనుఇవ్వడం జరుగుతోంది. ఒత్తిడిని , ఆందోళనను ఎదుర్కోవడంపై వివిధ మీడియా ప్లాట్‌ఫారం ల ద్వారా ఆడియో, వీడియో సమాచారం, అందరి బాగుకోసం మద్దతు సంరక్షణకు సంబంధించిన వాతావరణాన్ని పెంపొందించడం ఇందులో ఉన్నాయి.
అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరొసైన్సెస్ (నిమ్‌హాన్స్) బెంగళూరు , కోవిడ్ 19 మహమ్మారి సమయంలొ మానసిక ఆరోగ్యం, సాధారణ వైద్యులు, ప్రత్యేక మానసిక ఆరోగ్య సంరక్షణ విధానాలు పేరుతో సవివర మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ మార్గదర్శకాలు, సూచనలు, మద్దతు సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ లోని బిహేవియరల్ హెల్త్, సైకలాజికల్ హెల్ప్‌లైన్ ((https://www.mohfw.gov.in/) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నిమ్‌హాన్స్ హెల్త్‌వర్కర్ల సామర్ద్యాల నిర్మాణానికి మానసిక మద్దతు, శిక్షణను దీక్షా ప్లాట్‌ఫారం ద్వారా ఐ-జిఒటి కింద అందిస్తోంది.
మానసిక ఆరోగ్య రంగంలో తగినంత మంది మానసిక ఆరోగ్య నిపుణులు లేకపోవడం ఒక పెద్ద సవాలు. సంవత్సరం వారీగా, రాష్ట్రాల వారీగా, మానసిక ఆరోగ్య ప్రాక్టీషనర్ల జాబితాను కేంద్రీకృతంగా నిర్వహించడం లేదు.మానసిక ఆరోగ్య రంగంలో అర్హతగల మానసిక వైద్య నిపుణుల సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం ఎన్.ఎం.హెచ్.పి కింద సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు, మానసిక ఆరోగ్య స్పెషాలిటీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్టమెంట్‌లను ఏర్పాటు చేసేందుకు , వాటిని బలోపేతం చేసేందుకు మానవ వనరుల అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నది. ఇప్పటివరకు 25 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సులకు మద్దతు కల్పించడం జరిగింది. అలాగే దేశంలో 47 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్టమెంట్‌ల ఏర్పాటు , బలోపేతానికి మద్దతు న ఇవ్వడం జరిగింది.
మానసిక వైద్య సేవలు అందించేవారు తక్కువగా ఉన్న ప్రాంతాలలో మానవ వనరుల అందుబాటును పెంచేందుకు వివిధ కేటగిరీలలోని సాధారణ వైద్యలు, పారా మెడికల్ సిబ్బందికి డిజిటల్ పద్దతిద్వారా ఆన్‌లైన శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఇందుకు మూడు కేంద్ర మానసిక ఆరోగ్య సంస్థలైన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్, బెంగళూరు, లోకప్రియ గోపీనాథ్ బార్డోలి రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, తేజ్‌పూర్, అస్సాం, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి, రాంచీ లలో డిజిటల్ అకాడమియాలను ఏర్పాటు చేశారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఒక లిఖితపూర్వక సమాధానంలో రాజ్యసభకు ఈ విషయం తెలిపారు.
***
(Release ID: 1654627)