జల శక్తి మంత్రిత్వ శాఖ

జాతీయ నదుల సంరక్షణ కార్యక్రమం

Posted On: 14 SEP 2020 8:11PM by PIB Hyderabad

దేశంలో నదుల శుద్ధి, పునరుజ్జీవం ఒక నిరంతర ప్రక్రియ. నదుల్లో నిరంతరాయంగా ప్రవహిస్తున్న కాలుష్య సవాలును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా గుర్తించిన కలుషిత ప్రాంతాల్లో జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక (ఎన్ఆర్ సిపి) కింద చర్యలు తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం, సాంకేతిక సహాయం అందిస్తుంది. ఈ ఎన్ఆర్ సిపి కింద మురుగు నీటిని నిలువరించి, దారి మళ్లించే వ్యవస్థల ఏర్పాటు;  మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణం;  తక్కువ వ్యయంతో పారిశుధ్య వసతుల నిర్మాణం;  నదుల పరిసరాలు/  స్నానఘట్టాల అభివృద్ధి;  ప్రజా భాగస్వామ్యం, చైతన్య కల్పన వంటి పలు కాలుష్య నిరోధక చర్యలు, పనులు చేపడుతున్నారు. 

2018 నుంచి ఇప్పటివరకు ఎన్ఆర్ సిపి కింద రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మంజూరైన మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నిర్మాణం, రోజుకి మిలియన్ లీటర్ల (ఎంఎల్ డి) పరిమాణంలో సామర్థ్యాల కల్పన వంటి వివరాలు ఈ దిగువన ఉన్నాయి. 

కేంద్ర జలశక్తి, సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా రాజ్యసభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు అందించారు.  

***
 



(Release ID: 1654400) Visitor Counter : 104


Read this release in: English , Urdu