ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజెన్ తగినంతగా అందుబాటులో ఉండేందుకు 29 రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, అంతర్గత వాణిజ్యం&పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఫార్మాస్యూటికల్స్ కార్యదర్శి సంప్రదింపులు
Posted On:
14 SEP 2020 7:49PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, డిపిఐఐటి శాఖ కార్యదర్శి, ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి, టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి పాల్గొన్నారు. అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, చండీగఢ్, చత్తీస్ గఢ్, దాద్రా-నగర్ హవేలి-డమన్ & డయ్యూ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము & కశ్మీర్, కేరళ, లదాఖ్, లక్షదీవులు, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ ఎన్ సిటి, ఒడిశా, పంజాబ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, పరిశ్రమల శాఖ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రాష్ర్టాలన్నింటిలోని ఆరోగ్య వసతులకు నిరంతరాయంగా ఆక్సిజెన్ సరఫరా అయ్యేలా చూడడం, ఆక్సిజెన్ అంతర్ రాష్ట్ర రవాణా ఎలాంటి అవరోధాలు లేకుండా సాగేలా చూడడం ఈ సమావేశం లక్ష్యం.
ఈశాన్య రాష్ర్టాలన్నింటికీ ఆక్సిజెన్ సరఫరా చేసేందుకు అస్సాంలో 11 టాంకర్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ర్టాల్లో ఆక్సిజెన్ అవసరం ఎంత ఉన్నది మదింపు చేసుకుని అవసరాన్ని బట్టి మరిన్ని టాంకర్లను రంగంలోకి దించాలని, అవసరాన్ని బట్టి ఆక్సిజెన్ సరఫరాకు వీలుగా మరిన్ని టాంకర్లను సిద్ధం చేయాలని, ఆక్సిజెన్ సరఫరా లేని కారణంగా రోగులు ఇబ్బంది పడకుండా ఉండేలా టాంకర్లు తిరిగి వచ్చే సమయం తగ్గించాలని ఆదేశించారు.
రాష్ర్టాలకు ప్రత్యేకంగా ఈ దిగువ సలహాలు ఇచ్చారు.
1. ఆరోగ్యకేంద్రాలు/ ఆస్పత్రుల వారీగా ఆక్సిజెన్ ఇన్వెంటరీ నిర్వహణను చేపట్టి, ఆక్సిజెన్ స్టాక్ నిండుకోకుండా చూసేలా సకాలంలో అందుబాటులో ఉంచాలి.
2. వైద్య అవసరాలకు ఆక్సిజెన్ రవాణాలో రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలి.
3. లిక్విడ్ మెడికల్ ఆక్సిజెన్ (ఎల్ఎంఓ) టాంకర్లు నగరాల్లో తిరిగేందుకు “గ్రీన్ కారిడార్లు” ఏర్పాటు చేయాలి.
4. ఆక్సిజెన్ సరఫరాకు క్రయోజెనిక్ టాంకర్ల వినియోగాన్నిపర్యవేక్షించాలి.
5. ఆక్సిజెన్ సరఫరా చేసే వాహనాల సంఖ్య పెంచడం కోసం ఇతర టాంకర్లను ఆర్గాన్, నైట్రోజెన్ టాంకర్లుగా మార్చాలి.
6. ఆక్సిజెన్ సరఫరాదారులతో దీర్ఘకాలిక టెండర్లు/ కాంట్రాక్టు ఒప్పందాలు గల ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థలు ఆ కాంట్రాక్టులను గౌరవించాలి. అందుకు వీలుగా ఆక్సిజెన్ కదలికలపై రాష్ర్టాల స్థాయిలో ఎలాంటి పరిమితులు విధించకూడదు.
7. నిరంతరాయంగా ఆక్సిజెన్ సరఫరాలో ఉండేలా చూసేందుకు తయారీదారులు, సరఫరాదారులకు బకాయి బిల్లులు సకాలంలో చెల్లించాలి.
8. ఆక్సిజెన్ తయారీ యూనిట్లు నిరంతరాయంగా పని చేసేందుకు విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా చూడాలి.
9. ఆస్పత్రుల నిల్వ సామర్థ్యాలను మెరుగు పరచడంతో పాటు ఎంఎస్ఎంఇల వద్ద అందుబాటులో ఉన్న ఆక్సిజెన్ స్టోరేజి సామర్థ్యాలు కూడా గుర్తించాలి.
10. వైద్యపరంగా ఆక్సిజెన్ తప్పనిసరి అయిన వారికి మాత్రమే ఆక్సిజెన్ అందించేందుకు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆక్సిజెన్ లీకేజిని అరికట్టేందుకు ఆక్సిజెన్ వినియోగం ఆడిట్ చేపట్టాలి.
11. ఆక్సిజెన్ నింపే కేంద్రాలకు సిలిండర్లు పంపే సమయంలో నిబంధనల ప్రకారం ఆక్సిజెన్ సిలిండర్లను డిస్ ఇన్ఫెక్ట్ చేయాలి.
12. రోజుకి 6400 ఎంటి ఆక్సిజెన్ అందిస్తున్న ఆక్సిజెన్ తయారీదారులతో పాటుగా స్టీల్ ప్లాంట్ల వద్ద అందుబాటులో ఉన్న ఆక్సిజెన్ కూడా సమీకరించేందుకు ఉక్కు ప్లాంట్లతో సమర్థవంతమైన సమన్వయం సాధించాలి.
13. ఇప్పటికే పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజెన్ ఉత్పత్తి చేస్తున్న పారిశ్రామిక సంస్థలకు మెడికల్ ఆక్సిజెన్ తయారీ లైసెన్సుల జారీ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలి.
***
(Release ID: 1654399)
Visitor Counter : 156