సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఎంఎస్ఎంఇ రంగం పునరుద్ధరణకు తీసుకున్న పలు చర్యలు : శ్రీ గడ్కరి

Posted On: 14 SEP 2020 6:18PM by PIB Hyderabad

దేశంలో ఎంఎస్ఎంఇ రంగం వృద్ధి, అభివృద్ధికి ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ పలు పథకాలు, కార్యక్రమాలు చేపడుతుంది. వాటిలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఇజిపి); సాంప్రదాయిక పరిశ్రమల పునరుజ్జీవ నిధి పథకం (స్ఫూర్తి);  ఇన్నోవేషన్, గ్రామీణ పరిశ్రమలు, పారిశ్రామిక ధోరణుల ప్రోత్సాహక పథకం (యాస్పైర్); ఎంఎస్ఎంఇలు తీసుకునే అదనపు రుణాలకు వడ్డీ రాయితీ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలకు క్రెడిట్ గ్యారంటీ పథకం (ఎంఎస్ఇ-సిడిపి);  రుణ అనుసంధానిత మూలధన సబ్సిడీ, టెక్నాలజీ అప్ గ్రేడేషన్ పథకం (సిఎల్ సిఎస్-టియుఎస్) వంటివి వీటిలో ఉన్నాయి. 

ఇటీవల దేశంలో కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలో దాని ప్రభావానికి గురైన ఎంఎస్ఎంఇ రంగాన్ని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వాటిలో కొన్ని...

i) ఎంఎస్ఎంఇలకు రూ.20 వేల కోట్ల అనుబంధ రుణకల్పన
ii) ఎంఎస్ఎంఇలు సహా వ్యాపార సంస్థలకు రూ.3 లక్షల కోట్ల హామీ రహిత ఆటోమేటిక్ రుణాలు
iii) ఎంఎస్ఎంఇల కోసం ఏర్పాటు చేసిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ కు రూ.50 వేల కోట్ల అదనపు ఈక్విటీ కల్పన
iv) ఎంఎస్ఎంఇల వర్గీకరణకు సవరించిన కొత్త అర్హతలు
v) ఎంఎస్ఎంఇలకు &#39 ద్వారా కొత్త రిజిస్ర్టేషన్;  #39 ద్వారా ఉదయం రిజిస్ర్టేషన్;  వ్యాపార సరళీకరణ
vi) ఎంఎస్ఎంఇలకు సహాయంగా రూ.200 కోట్ల వరకు సమీకరణకు అంతర్జాతీయ టెండర్లు

ప్రధానమంత్రి 2020 జూన్ 1వ తేదీన ఆన్ లైన్ పోర్టల్ చాంపియన్స్  ను ఆవిష్కరించారు. ఎంఎస్ఎంఇల ఫిర్యాదుల పరిష్కారం, వాటికి అండదండలు అందించడం వంటి పలు అంశాలు ఇ-గవర్నెన్స్ లో ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 9వ తేదీ నాటికి ఈ పోర్టల్ ద్వారా 18,723 ఫిర్యాదులు పరిష్కరించారు. ఎంఎస్ఎంఇల ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్ బిఐ కూడా పలు చర్యలు ప్రకటించింది. 
కేంద్ర మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

***



(Release ID: 1654397) Visitor Counter : 183


Read this release in: English , Urdu , Marathi