మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైనారిటీ వర్గాల్లోని పేద విద్యార్థుల కోసం 2014-15 నుంచి ఇప్పటివరకు 4 కోట్లకు పైగా ఉపకార వేతనాలు పంపిణీ
Posted On:
14 SEP 2020 8:42PM by PIB Hyderabad
మైనారిటీలుగా గుర్తించిన బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, ముస్లిములు, పార్శీలు, సిక్కుల సామాజిక, ఆర్థిక, విద్య సాధికారత కోసం వివిధ సంక్షేమ పథకాలను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఆయా పథకాల వివరాలను www.minorityaffairs.gov.in లో చూడవచ్చు.
2015-16 నుంచి 2019-20 వరకు, గుర్తించిన మైనారిటీల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖ కేటాయించిన మొత్తం
రూ.21,160.84 కోట్లు. ఇందులో ఖర్చు చేసింది రూ.19,201.45 కోట్లు. కేటాయించిన మొత్తంలో ఇది దాదాపు 90.75 శాతం.
2014-15 నుంచి ఇప్పటివరకు, మైనారిటీల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు 4,00,06,080 ఉపకార వేతనాలను మంత్రిత్వ శాఖ ద్వారా అందించాం. వీటి విలువ రూ.11,690.81 కోట్లు. 2015-16 నుంచి 2019-20 మధ్య, వివిధ పథకాల ద్వారా రూ.9223.68 కోట్ల విలువైన 3,06,19,546 ఉపకార వేతనాలను మైనారిటీ వర్గాల విద్యార్థులకు మంత్రిత్వ శాఖ పంపిణీ చేసింది. ఈ మొత్తంలో దాదాపు 54 శాతాన్ని బాలికలు అందుకున్నారు.
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
***
(Release ID: 1654393)
Visitor Counter : 90