కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కంపెనీలకు, పరిమిత రుణభార భాగస్వామ్యాలకు కోవిడ్ సడలింపులు

Posted On: 14 SEP 2020 5:41PM by PIB Hyderabad

కోవిడ్ సంక్షోభ సమయంలో కంపెనీల మీద, పరిమిత ఋణభార భాగస్వామ్య సంస్థలమీద భారం పడకుండా చూసేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కొన్ని రాయితీలు, మినహాయింపులు, సడలింపులు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు లోక్ సభలో ఒక ప్రశ్నకు ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

తీసుకున్న చర్యలను ఇలా వివరించారు:

30.03.2020  తేదీతో 12/2020  నెంబర్ జనరల్ సర్క్యులర్ జారీచేయటం ద్వారా కంపెనీల తాజా ఆరంభ పథకం ప్రవేశపెట్టటం. దీనివలన కంపెనీలు ఎలాంటి అదనపు ఫీజూ లేకుండా, చట్టపరమైన చర్యలకూ తావులేకుండా డాక్యుమెంట్లు దాఖలు చేసే అవకాశం కల్పించబడింది.

పరిమిత ఋణ భాగస్వామ్య పరిష్కార పథకం,  2020 ప్రవేశపెట్టి సి ఎఫ్ ఎస్ ఎస్  2020 లోని ప్రయోజనాలనే కల్పించటం

కార్పొరేట్ సంస్థలు బోర్డు, సర్వ సభ్య సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరుపుకోవటానికి వెసులుబాటు కల్పిస్తూ జనరల్ సర్క్యులర్ నెం. 14/2020 జారీ

అకౌంటింగ్, ఆడిట్, బదలాయింపు, వాపసు కు సంబంధించి వివిధ డాక్యుమెంట్ల సమర్పణకు 2016 నిబంధనలలోని సెక్షన్ 124, 125 కింద ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టటం

2019 మార్చి 31 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు సర్వసభ్య సమావేసాలు జరుపుకోవటానికి ప్రత్యేక మినహాయింపులు ఇస్తూ,  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుకోవటానికి అనుమతి ఇస్తూ  20/2020 . 28/2020 నెంబర్ల సర్క్యులర్లను 21-04-2020  తేదీతో జారీ చేయటం

కార్పొరేట్ సంస్థలు ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఉపద్రవాల సహాయ కార్యకాలాపాల నిర్వహణ వంటి రంగాలలో సి ఎస్ ఆర్ నిధులు వెచ్చించేందుకు అనుమతి

2019-2020  ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక సర్వసభ్య సమావేశం గడువు ముగిసిన మూడు నెలల తరువాత కూడా జరుపుకోవటానికి పొడిగింపు. దీనివలన 12 లక్షల కంపెనీలకు లబ్ధి. ఇందుకోసం ఎలాంటి దరఖాస్తూ చేసుకోవాల్సిన అవసరం గాని, ఆలస్యపు రుసుకు చెల్లించాల్సిన అవసరం గాని  లేకుండా ఒక్కో ఆర్ వో సి 08.09.2020  నాడు ఆదేశాల జారీ

***



(Release ID: 1654303) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Manipuri