పర్యటక మంత్రిత్వ శాఖ

'దేఖో అప్నా దేశ్' చొరవతో మ‌న దేశ‌ గొప్ప వారసత్వం మరియు సంస్కృతిని ప్రోత్సహిస్తున్న‌‌ పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 14 SEP 2020 6:36PM by PIB Hyderabad

మ‌న దేశ‌పు గొప్ప వారసత్వం మరియు సంస్కృతిని గురించి పౌరులలో అవగాహన కల్పించే లక్ష్యంతో పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో 'దేఖో అప్నా దేశ్‌'(డీఏడీ) చొరవను ప్రారంభించింది. దేశంలో విస్తృతంగా ప్రయాణించేలా పౌరులను ప్రోత్సహించడం మరియు పర్యాటక అడుగుజాడలను పెంచడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మరియు స్థానిక స్థాయిలో ఉద్యోగాల కల్పనకు దారీ తీస్తుంది. ఈ ఉద్దేశంతోనే డీఏడీ ప్రారంభించ‌డ‌మైంది. దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి గాను 2022 నాటికి దేశంలో ప్రతి పౌరుడు కనీసం 15 ప‌ర్య‌ట‌క స్థ‌లాల‌ను సందర్శించాలని ఆగస్టు 15, 2019న గౌరవ ప్రధాని చేసిన ప్రసంగానికి అనుగుణంగా ఈ చొరవ చేప‌ట్ట‌డ‌మైంది. ఈ చొరవలో భాగంగా మంత్రిత్వ శాఖ మ‌న దేశంలో ఉన్న‌ విభిన్న సంస్కృతి, వారసత్వం, గమ్యస్థానాలు మరియు పర్యాటక ఉత్పత్తులను ప్రదర్శిస్తూ డీఏడీ వెబ్‌నార్ల శ్రేణిని నిర్వహిస్తోంది. ఈ చొరవలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప‌ర్య‌ట‌క విశేషాల‌తో 52 వెబ్‌నార్లు నిర్వహించబడ్డాయి. సామూహిక అవగాహన కల్పించడానికి గాను మంత్రిత్వ శాఖ మైగౌ డాట్ ఇన్ వేదిక‌పై ఆన్‌లైన్ డీఏడీ ప్రతిజ్ఞను మరియు ఒక క్విజ్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ ప్రతిజ్ఞ మరియు క్విజ్ అందరికీ అందుబాటులో ఉండేలా తగు చ‌ర్య‌లు తీసుకుంది. డీఏడీ చొరవ సోషల్ మీడియా ఖాతాలు మరియు మంత్రిత్వ శాఖ యొక్క వెబ్‌సైట్ మరియు దేశీయ భారత పర్యాటక కార్యాలయాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది.

కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు లోక్‌స‌భ‌కు ఇచ్చిన‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియ‌జేశారు.
                               

*****



(Release ID: 1654286) Visitor Counter : 88


Read this release in: Gujarati , English , Punjabi