యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖో ఖో, కబడ్డీకి ప్రోత్సాహం
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2020 6:04PM by PIB Hyderabad
దేశంలో కబడ్డీ, ఖో ఖోను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన 'అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా', 'ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా'కు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, 'స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' ద్వారా తగినంత ఆర్థిక సాయం, ఇతర మద్దతు అందుతోంది. 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్'లో కబడ్డీ, ఖో ఖో భాగమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 'గ్రూప్ సి' ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో, క్రీడల కోటా జాబితాలో ఈ రెండు ఆటలను చేర్చారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ కిరెన్ రిజిజు, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
***
(రిలీజ్ ఐడి: 1654272)
సందర్శకుల సూచీ సంఖ్య : : 104