హోం మంత్రిత్వ శాఖ

గాంధీ నగర్ జిల్లాలో మరియు నగరంలో రూ. 15.01 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించి ప్రజలకు అంకితమిచ్చిన కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా

రూ. 119.63 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శ్రీ అమిత్ షా శంకుస్థాపన చేశారు

"ప్రధానమంత్రి శ్రీ మోదీ నేతృత్వంలో మనందరం గాంధీనగర్ ను లోక్ సభ లో ఒక ఆదర్శ నియోజకవర్గంగా మార్చడానికి కృషి చేయగలమన్న నమ్మకం నాకుంది"

"కరోనాపై పోరాటంలో ప్రజలను జాగృతం చేయడమే తగిన పరిష్కారం"

ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో ఆపన్నులకు రేషన్, మాస్కులు, శానిటైజర్లు మరియు మందులు ఇచ్చి మానవతకు సేవచేస్తున్న గాంధీనగర్ వలంటీర్లకు కేంద్ర హోమ్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు

Posted On: 10 SEP 2020 7:06PM by PIB Hyderabad

 

గాంధీ నగర్ జిల్లాలో మరియు నగరంలో రూ. 15.01 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించి ప్రజలకు అంకితమిచ్చారు.  అంతేకాక రూ. 119.63  కోట్ల విలువైన వివిధ  అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.  పునాది రాయి వేసిన వాటిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు,  ఉద్యానవనాలు విస్తరణ,  రోడ్ల విస్తరణ ,  బాలికల పాఠశాలలో కొత్త తరగతి గదుల ఏర్పాటు ఉన్నాయి.   ఈ అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల గాంధీనగర్ అభివృద్హి మరింత వేగిరమవుతుంది.  గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ పటేల్ రూపాల్ గ్రామం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ  ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీ అమిత్ షా "ప్రధానమంత్రి శ్రీ మోదీ నేతృత్వంలో మనందరం గాంధీనగర్ ను లోక్ సభ లో ఒక ఆదర్శ నియోజకవర్గంగా మార్చడానికి కృషి చేయగలమన్న నమ్మకం నాకుంది"  అని అన్నారు.  "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జాతి యావత్తూ  విశ్వ మహమ్మారి కరోనాపై పోరాటం చేస్తోందని" కూడా కేంద్ర హోమ్ మంత్రి అన్నారు.  మరొకవైపు ముఖ్య మంత్రి శ్రీ విజయ్ రూపాన్ని నేతృత్వంలో గుజరాత్ రాష్ట్రంలో కరోనాపై పోరు సాగుతోందని,  నిరంతరం సాగుతున్న ఈ ప్రయత్నాల వల్ల మరణాల రేటు తగ్గి కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిందని అన్నారు.  

"కరోనాపై పోరాటంలో ప్రజలను జాగృతం చేయడమే తగిన పరిష్కారం"  అని కేంద్ర హోమ్ మంత్రి అన్నారు. రెండు గజాల ఎడం ఉండే విధంగా ఖశ్చితంగా  భౌతిక దూరం పాటించవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   ప్రధానమంత్రి మోదీ  నేతృత్వంలో  ఆపన్నులకు రేషన్, మాస్కులు, శానిటైజర్లు మరియు మందులు ఇచ్చి మానవతకు సేవచేస్తున్న గాంధీనగర్ వలంటీర్లకు  శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు

***



(Release ID: 1653232) Visitor Counter : 150