కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏజీఎం నిర్వహించే గడువు పొడిగిస్తూ ఉత్తర్వు

प्रविष्टि तिथि: 08 SEP 2020 10:18PM by PIB Hyderabad

దాదాపు 12 లక్షల సంస్థలకు ఊరటనిస్తూ కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) నిర్ణయం తీసుకుంది. వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించడానికి సంస్థలకు ఉన్న గడువు సెప్టెంబర్‌ 30ను, డిసెంబర్‌ 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వు ఇచ్చింది.

    దరఖాస్తులు, రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్‌వోసీలను మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. ఇప్పటికే వచ్చి, ఆమోదం లేదా తిరస్కారం పొందని దరఖాస్తులకు కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుంది.

    కరోనా వ్యాప్తి నిరోధంతోపాటు, వివిధ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, సర్వసభ్య సమావేశం గడువును పొడిగిస్తూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని సంస్థలకు ఇలాంటి వెసులుబాటు ఇవ్వడం ఇదే ప్రథమం.

***


(रिलीज़ आईडी: 1652531) आगंतुक पटल : 311
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी