శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఇన్‌ఫెక్ష‌న్ క‌లిగిన‌ కోవిడ్ 19 వంటి స్రావాల‌ను గ‌ట్టిప‌రిచి , వాటి త‌ర‌లింపులో ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఎలాంటి హాని జ‌ర‌గ‌కుండా చూసే కానిస్ట‌ర్ బ్యాగ్‌లు


Posted On: 04 SEP 2020 7:16PM by PIB Hyderabad

అంటువ్యాధుల‌కు కార‌ణ‌మ‌య్యే కోవిడ్ -19, క్ష‌య‌వ్యాధి   వంటి ర‌క‌ర‌కాల వ్యాధుల‌కు సంబంధించి వెలువ‌డే గ‌ళ్ల‌వంటి స్రావాల‌ను ఘ‌నీభ‌వింప చేసి, వాటిని ఇన్‌ఫెక్ష‌న్ ర‌హితంగా మార్చే  కానిస్ట‌ర్ బ్యాగ్‌వ‌ల్ల ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల ప్రాణాలు కాపాడ‌బ‌డ‌డ‌మేకాకుండా, వాటిని త‌ర‌లించే స‌మ‌యంలో అవి బ‌య‌ట‌కు ఒలికిపోకుండా ఉండ‌డానికి వీలుక‌లుగుతుంది.త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే ఈ వ్య‌ర్ధాలు అత్యంత ప్ర‌మాద‌క‌రమౌతాయి. అయితే వీటిని తాజాగా రూపొందించిన కానిస్ట‌ర్ బ్యాగ్ ల‌ద్వారా అదుపు చేయ‌డానికి, ఇన్‌ఫెక్ష‌న్ కార‌క స్రావాల‌ను ఘ‌న‌రూపంలోకి మార్చి, క్రిమిరహితం చేసి స‌త్వ‌రం దానిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు త‌ర‌లించ‌డానికి ఇది వీలుకలిగిస్తుంది.

ఇన్‌ఫెక్ష‌న్‌కు గురైన ఊపిరితిత్తుల‌నుంచి వ‌చ్చే ద్ర‌వ‌రూప వ్య‌ర్ధ‌స్రావాల నిర్వ‌హ‌ణ‌కు శ్రీ‌చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మెడిక‌ల్ సైన్సుఅండ్ టెక్నాల‌జీ (ఎస్‌సిటిఐఎంఎస్‌టి) ఒక ప‌రిష్కారంతో ముందుకు వ‌చ్చింది. స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తిగ‌ల ఈ సంస్థ భార‌త ప్ర‌భుత్వానికి చెందిన‌ డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాల‌జీ ప‌రిధిలోని సంస్థ‌. ఆస్ప‌త్రులు, ఐసియులోని పేషెంట్లకు సంబంధించి ఊపిరితిత్తుల‌నుంచి వ‌చ్చే స్రావాల‌ను ఇన్‌ఫెక్ష‌న్ ర‌హితం చేసి సుర‌క్షితంగా వ్య‌ర్దాల నిర్వ‌హ‌ణ కేంద్రాల‌కు త‌ర‌లించేందుకు ఈ సంస్థ కానిస్ట‌ర్ బ్యాగ్‌ల‌ను అభివృద్ధి చేసింది.  ఆక్రిలోసోర్బ్ పేరుగ‌ల క్రిమిర‌హిత ప‌దార్ధంతో ఈ బ్యాగ్‌ల‌ను రూపొందించారు.

పేషెంట్‌ను ఆస్ప‌త్రిలో అడ్మిట్ చేర్చిన త‌ర్వాత ఊపిరితిత్తుల‌నుంచి వ‌చ్చే స్రావాల‌ను బాటిళ్ల‌లో ,క్యాన్‌ల‌లో ప‌ట్టి, వాటిని క్రిమిర‌హితంచేసి  త‌ర‌లిస్తూ వ‌స్తున్నారు. అయితే వీటిని త‌ర‌లించడం ఎంతో  రిస్కుతో కూడుకున్న‌ది. భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాలు, మాన‌వ వ‌న‌రుల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

కానిస్ట‌ర్ బ్యాగ్‌లు 500 మిల్లీలీట‌ర్ల స్రావాల‌ను పీల్చుకుని వాటిని వెంట‌నే గ‌ట్టిప‌ర‌చ‌గ‌లుగుతాయి. దీనికితోడు , ఏమాత్రం స‌మ‌యం వృధాకాకుండా అందులోని ప‌దార్ధం క్రిమిర‌హితంగా మారుతుంది. బ్యాగ్‌లోని  ప‌దార్ధం వెంట‌నే క్రిమిర‌హితంగా మారి గట్టిగా త‌యార‌వ‌డంతో ఇన్‌ఫెక్ష‌న్లు సోక‌డానికి అవ‌కాశం త‌క్కువ‌. ఇది ఆరొగ్య కార్య‌క‌ర్త‌ల‌ను ర‌క్షించ‌డానికి ఉప‌క‌రిస్తుంది. ఈ ఉత్ప‌త్తిని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ప‌రీక్షించి చూశారు.

దీనిని సుసాధ్యంచేసిన ఎస్‌సిటిఐఎంఎస్‌టి బృందంలో బ‌యో మెటీరియ‌ల్ శాస్త్ర‌వేత్త‌లు, క్లినిసియ‌న్లు డాక్ట‌ర్ మంజు ఎస్‌. డాక్ట‌ర్ మ‌నోజ్ కోమ‌త్‌, డాక్ట‌ర్ ఆశా కిశోర్, డాక్ట‌ర్ అజ‌య్ ప్ర‌సాద్ హృషి ఉన్నారు. ఆక్రిలోసోర్బ్ స‌క్ష‌న్ కానిస్ట‌ర్ లైన‌ర్ (సిఎల్ సిరీస్‌0 బ్యాగ్‌ల‌కు సంబంధించిన ప‌రిజ్ఞానాన్ని రామ్‌స‌న్స్ సైంటిఫిక్ , స‌ర్జిక‌ల్ ప్రైవేట్ లిమిటెడ్ కు అందించారు. వీరు వీటిని త‌యారు చేసి మార్కెటింగ్ చేస్తారు. ఈ కానిస్ట‌ర్ లైన‌ర్ బ్యాగ్‌లు ఒక్కొక్క‌టి సుమారు 100 రూపాయ‌లు ధ‌ర‌కు ల‌భించ‌నున్నాయి.

రామ్‌స‌న్స్ సైంటిఫిక్‌, స‌ర్జిక‌ల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్ప‌ర ప్ర‌దేశ్ లోని సంస్థ‌. వైద్య ఉప‌క‌ర‌ణాల త‌యారీలో అంత‌ర్జాతీయ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న సంస్థ‌. ఇది 200 కుపైగా ఉత్ప‌త్తుల‌ను మార్కెట్ చేస్తున్న‌ది.

డిస్పోజ‌బుల్ మెడిక‌ల్‌, స‌ర్జిక‌ల్ ఉప‌క‌ర‌ణాల త‌యారీలో ఈ కంపెనీకి నైపుణ్యం ఉంది . వైద్య ఉప‌క‌ర‌ణాల మార్కెట్‌ మంచి బ్రాండ్ పేరు క‌లిగి ఉంది. 65 దేశాల‌లో ఈ కంపెనీకి డిస్ట్రిబ్యూష‌న్ ఛాన‌ళ్లు ఉన్నాయి. వీరు త‌యారుచేసే చాలా ఉత్ప‌త్తుల‌కు ఐఎస్ఒ, సిఇ స‌ర్టిఫికేష‌న్‌లు ఉన్నాయి.స‌క్ష‌న్ కానిస్ట‌ర్ లైన‌ర్ బ్యాగ్‌ల కు సంబంధించి క్షేత్ర స్థాయి ప‌రీక్ష‌లు ఎస్‌సిటిఐఎంఎస్‌టిలో నిర్వ‌హించ‌నున్నారు.

****



(Release ID: 1651663) Visitor Counter : 206