సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జాతీయ విద్యా విధానం 2020 ని ప్రవేశపెట్టడం, విద్యారంగంలోని అన్ని రకాల అసంబద్ధతలను సరిదిద్దేదిశగా తీసుకున్నఒక చారిత్రాత్మక నిర్ణయం : డాక్టర్ జితేంద్రసింగ్
జాతీయ విద్యా విధానం 2020 : ఆరోగ్య విద్యా దృక్పథం పై వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
04 SEP 2020 6:15PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం 2020 దేశంలో విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్న పలు అసంబద్ధతలను సరిదిద్దే దిశగా వేసిన ఒక చరిత్రాత్మక అడుగు అని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి (స్వంతంత్ర ), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
జాతీయ విద్యా విధానం -2020: ఆరోగ్య విద్యా దృక్పథం అనే అంశంపై, హర్యానాలోని శ్రీ విశ్వకర్మ నైపుణ్య విశ్వవిద్యాలయం, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో (ఇగ్నో) కలసి ఈరోజు ఏర్పాటు చేసిన వెబినార్‌నుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, నైపుణ్యాలు, వృత్తి విద్యపై మరింత దృష్టిని పెట్టే జాతీయ విద్యావిధానం 2020 ని ప్రవేశపెట్టడం వెనుక నరేంద్రమోడీ ప్రభుత్వం బలమైన రాజకీయ సంకల్పం ఉందని ఆయన అన్నారు.
జాతీయ విద్యావిధానం -2020 స్కోరు ఆధారిత విధానం కాదని, ఇది ఆప్టిట్యూడ్ ఆధారిత విధానమని మంత్రి అన్నారు. ఈ విధానం వ్యవస్థలో ఉన్న మునుపటి అన్ని లోటుపాట్లను సరిదిద్దుతుందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి ఉన్నత విద్యారంగంలో ప్రధాన సంస్కరణలు తీసుకురావడం జరిగిందని అన్నారు. 2035 నాటికి స్థూల ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి 50 శాతానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఆరోగ్య విద్యాదృక్పథం గురించి మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య విద్యా సమగ్రత ప్రాధాన్యతను ఎలా పరిగణనలోకి తీసుకోవాలో మనకు కరోనా (కోవిడ్ -19) నేర్పించిందన్నారు. ఆరోగ్య విద్యలో సమగ్రత ,ప్రజలను వ్యక్తిగత ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు.
ఆరోగ్య విద్యకు సంబంధించి చూసినపుడు , మానవ జీవితం ప్రమాదంలో ఉన్నందున, దాని పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నిరంతరం అభివృద్ధి చెందే విధంగా ఉండాలని మంత్రి అన్నారు. దేశంలో వైద్య విద్య అభ్యసించకుండానే వైద్యం చేస్తున్న వారి సమస్య గురించి ప్రస్తావిస్తూ, వారు చట్టబద్ధంగా వైద్యం చేస్తున్న వారికి క్లిష్టపరిస్థితి కల్పిస్తున్నారన్నారని, ఇది సరైనది కాదని అన్నారు.
నేషనల్ రిక్రూట్ మెంట్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ ఆర్ ఎ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిక్రూట్‌మెంట్ రంగంలో ఒక గేమ్ ఛేంజర్ అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఇది పాలనా పరమైన సంస్కరణ మాత్రమే కాకుండా సామాజిక ఆర్ధిక సంస్కరణ కూడా అని ఆయన అన్నారు. ఇది రిక్రూట్‌మెంట్ ను పల్లెలు, పట్టణాలకు తీసుకువస్తుందని అన్నారు.
సివిల్ సర్వీసుల సామర్ధ్యాల నిర్మాణానికి సంబంధించి (ఎన్‌పిసిఎస్‌సిబి) కేంద్ర కేబినెట్ ఆమోదించిన మిషన్ కర్మయోగి గురించి ప్రస్తావిస్తూ ఆయన, నవ భారతదేశానికి అనుగుణంగా నూతన భవిష్యత్ కు సిద్దమైన సివిల్ సర్వీసును ఏర్పరచడంలో కీలక పాత్ర పోషించనుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
సివిల్ సర్వీసులను నిజమైన కర్మయోగిగా మార్చే ప్రయత్నం ఇది అని ఆయన అన్నారు. వీరు సృజనాత్మక,నిర్మాణాత్మక, సానుకూల, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేవిధంగా సాంకేతిక సాధికారతకు వీలు కల్పిస్తుందని అన్నారు. అలాగే పరస్పరం సమాచారం మార్చుకొకుండా విడి విడిగావ్యవహరించే పనిసంస్కృతికి చరమగీతం పాడుతుందని, అలాగే పలు శిక్షణ మాడ్యూళ్ల సమస్యను అధిగమిస్తుందని ఆయన అన్నారు.
2020 ఆగస్టు 19న చరిత్రాత్మక జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు అనంతరం, మిషన్ కర్మయోగి ప్రపంచంలోనే అతి పెద్ద సివిల్ సర్వీసు సంస్కరణగా రుజువుకానున్నదని ఆయన అన్నారు. అన్ని సర్వీసులకు అన్నిస్థాయిలలో అన్ని భాషలలో వారి కెరీర్ మధ్యలో శిక్షణ అందుబాటులొ ఉంటుందని, ఇది భారతప్రభుత్వంలోని అన్ని స్థాయిలలో వృత్తిపరమైనసేవలను అందించడానికి ఉపకరిస్తుందని అన్నారు.
ఈ వెబినార్‌లో పాల్గొని ప్రసంగించిన వారిలో ఇగ్నోవైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, హర్యానాకు చెందిన ఎస్‌విఎస్‌యు వైస్ ఛాన్సలర్ శ్రీ రాజ్ నెహ్రూ, భువనేశ్వర్ కు చెందిన ఎస్.ఒ.ఎ విశ్వవిద్యాలయం ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అమిత్ బెనర్జీ, ఇగ్నో ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ దాస్, హర్యానాలోని ఎస్ వి ఎస్ యు రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ . సల్హాన్, డీన్ ప్రొఫెసర్ ఆర్.ఎస్.రాథోర్ లు ఉన్నారు.
***
(Release ID: 1651469)
Visitor Counter : 127