భారత పోటీ ప్రోత్సాహక సంఘం

91 స్ట్రీట్స్, ఆస్కెంట్, ఎ.పి.ఐ., ఆహాన్, లోక్ ప్రకాశ్ ఈక్విటీ వాటాల స్వాధీనానికి సి.సి.ఐ. ఆమోదం ఎల్.జి.టి. సంస్థ తరఫున ప్రక్రియకు ఓకె

Posted On: 26 AUG 2020 5:58PM by PIB Hyderabad

   కొన్ని కంపెనీల్లోని ఈక్విటీ వాటాల స్వాధీనానికిగాను లైట్ స్టోన్ ఫండ్ ఎస్.. కంపెనీ కోసం నిర్వహించిన  ప్రక్రియకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి..)   రోజు ఆమోదం తెలిపింది. లైట్ స్టోన్ గ్లోబల్ ఫండ్ (ఎల్.జి.టి.) తరఫున ప్రక్రియను నిర్వహించారు. 91 స్ట్రీట్స్ మీడియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (91 స్ట్రీట్స్), ఆస్కెంట్ హెల్త్ అండ్ వెల్ నెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆస్కెంట్), .పి.. హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (.పి..), ఆహాన్ కమర్సియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆహాన్), లోక్ ప్రకాశ్ విద్యా ప్రైవేట్ లిమిటెడ్ (లోక్ ప్రకాశ్) కంపెనీలకు సంబంధించిన ఈక్విటీ వాటాల స్వాధీనానికి సంబంధించి ప్రక్రియ జరిగింది. 2002 సంవత్సరపు కాంపిటీషన్ చట్టంలోని 31(1) సెక్షన్ ప్రకారం ప్రక్రియను నిర్వహించారు.

లైట్ స్టోన్ ఫండ్ ఎస్.. అనేది ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని కలిగిన సంస్థ. లైట్ స్టోన్ గ్లోబల్ ఫండ్ పేరిట ఒక ఉపనిధి వ్యవస్థగా సంస్థ ఏర్పాటైంది. ఎల్.జి.టి. క్యాపిటల్ పార్టనర్స్ (ఐర్లండ్) లిమిటెడ్ అనే ప్రత్యామ్నాయ పెట్టుబడి నిర్వహణా సంస్థ,.. కంపెనీని నిర్వహిస్తోంది.

 దేశంలో నమోదైన 91 స్ట్రీట్స్ సంస్థ ప్రత్యక్షంగానూ, తన అనుబంధ సంస్థల రూపంలోనూ దేశవ్యాప్త ప్రాతిపదికన కార్యకలాపాలు నిర్వహిస్తోందివెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్ వంటి సదుపాయాలతో కామర్స్ వేదికను రూపకల్పన చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మేధో సంపత్తిని 91 స్ట్రీట్స్ కంపెనీ కలిగి ఉంది. రిటైల్ సంస్థలు, రిటైల్ ఫార్మసీలు జరిపే మందుల అమ్మకాలు, పోషకాహార ఔషధాల అమ్మకాలపై సంస్థ తన దృష్టిని కేంద్రీకరిస్తూ వస్తోంది. ధర్డ్ పార్టీ లేబరేటరీలు అందించే వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్యాకేజీల విక్రయాలపై దృష్టిని కేంద్రీకరించి సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తోంది. టెలీ మెడికల్ సంప్రదింపుల వేదికను కూడా నిర్వహిస్తోంది. దీనికి తోడు, బిజినెస్ టు బిజినెస్ (బి టు బి) ప్రాతిపదికన ఔషధ ఉత్పత్తుల అమ్మకం, పంపిణీ కార్యకలాపాలను 91 స్ట్రీట్స్  తన అనుబంధ సంస్థల ద్వారా నిర్వహిస్తోంది. ఔషధాలను రిటైల్ గా అమ్మకం జరిపే వ్యాపార సంస్థల విక్రయ కార్యకలాపాలను సంస్థ చేపడుతోంది. రిటైలర్స్ కు ఔషధాల సరఫరా, రవాణా కార్యకలాపాల లాజిస్టిక్స్ ను కూడా అందిస్తోంది.

   ఆస్కెంట్ సంస్థ ప్రత్యక్షంగానే కాక, తన అనుబంధ సంస్థల రూపంలోకూడా దేశవ్యాప్త ప్రాతిపదికన కార్యకలాపాలు సాగిస్తోంది. బిజినెస్ టు బిజినెస్ (బి టు బి) ప్రాతిపదికన ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టోకున జరిగే విక్రయాలు సంస్థ కార్యకలాపాల  పరిధిలోకి వస్తాయి. కౌంటర్ ద్వారా ఔషధాల అమ్మకం, పంపిణీ కార్యకలాపాలు, వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువులు (ఎఫ్.ఎం.సి.జి.),  పోషకాహార ఔషధాల క్యాష్ అండ్ పద్ధతిలో అమ్మకం, మొబైల్ అప్లికేషన్ల యాజమాన్యం, రూపకల్పన వంటి వాటిని సంస్థ అజమాయిషీ చేస్తుంది. ఔషధాల తయారీ పరిశ్రమలో బిజినెస్ టు బిజినెస్ ప్రాతిపదికన జరిగే విక్రయాలపై ఒక క్రమబద్ధమైన నిర్వణా వ్యవస్థ ఏర్పాటుకు కార్యకలాపాలు దోహదపడతాయి.

  .పి.. సంస్థ ప్రస్తుతానికి నేరుగా ఎలాంటి వ్యాపార కార్యకలాపాల్లోనూ లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తన అనుబంధ సంస్థ ద్వారా ఇన్ స్టింక్ట్ ఇన్నొవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో వాటాను దక్కించుకుంది. ఆరోగ్య రక్షణ, ఆరోగ్యేతర రంగం, రిటైల్ ఫార్మసీల అప్లికేషన్ సేవలకు సంబంధించిన సాఫ్ట్ వేర్ సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పన, వనరుల ప్రణాళికా కార్యకలాపాల్లో ఇన్ స్టింక్ట్ ఇన్నొవేషన్ సంస్థ నిమగ్నమై ఉంది.

  ఆహాన్, లోక్ ప్రకాశ్ సంస్థలు మాత్రం ఎలాంటి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడంలేదు. వాటి పరిధిలో ప్రస్తుతానికి ఎలాంటి అనుబంధ సంస్థలు కూడా లేవు.

  వాటాల స్వాధీనానికి సంబంధించి సి.సి.. జారీ చేసిన ఉత్తర్వు తర్వాత వెలువడుతుంది.

****




(Release ID: 1648851) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Hindi , Tamil