విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కారణం గా విద్యుత్తు రంగాని కి ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని దూరం చేసేందుకు ద్రవ్యత్వాన్ని సమకూర్చడం కోసం తీసుకొనే చర్యల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 19 AUG 2020 4:29PM by PIB Hyderabad

విద్యుత్తు వితరణ కంపెనీ (డిఐఎస్ సిఒఎం) ల కు గత సంవత్సరం ఆర్జించిన ఆదాయం లో 25 శాతం నిర్ధారిత పరిమితి కంటే అధికం గా నిర్వహణ మూలధనాన్ని ఉజ్వల్ డిస్ కమ్ అశ్యువరన్స్ యోజన (యుడిఎవై) లో భాగం గా అందించడం కోసం పావర్ ఫైనాన్స్ కార్పొరేశన్ (పిఎఫ్ సి) కి, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ ఇసి) కు ఒక సారి మినహాయింపు ను ఇచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది.

విద్యుత్తు రంగాని కి ద్రవ్యత్వాన్ని సమకూర్చడం లోను, డిఐఎస్ సిఒఎం లకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లింపులు జరపడానికి పూచీ పడటం లోను ఒక సారి మినహాయింపు సహాయకారి కాగలదు.

పూర్వరంగం:

ప్రపంచవ్యాప్త వ్యాధి కోవిడ్-19 అకస్మాత్తుగా దేశం లో చెలరేగిన నేపథ్యం లో దేశం అంతటా లాక్ డౌన్ ను విధించడం తో విద్యుత్తు రంగం లో ద్రవ్యత్వం సంబంధిత  సమస్య లు ముమ్మరం అయ్యాయి.  ప్రజలు వినియోగించుకొన్న కరెంటు కు చెల్లింపుల ను జరపడం లో అసహాయులు అయినందువల్ల విద్యుత్తు పంపిణీ కంపెనీల కు ఆదాయాలు భారీ గా పడిపోయాయి.  మరో వైపు విద్యుత్తు సరఫరాల ను- అవి అత్యవసర సేవ కావడం వల్ల- కొనసాగించవలసివచ్చింది.  విద్యుత్తు వినియోగం చెప్పుకోదగిన రీతి లో తగ్గింది.  ఆర్థిక కార్యకలాపాలు వేగాన్ని అందుకోవడానికి, ఇంకా విద్యుత్తు గిరాకీ పుంజుకోవడానికి కొంత కాలం పట్టేటట్లు ఉన్నందున స్వల్ప కాలాని కి విద్యుత్తు రంగం లో ద్రవ్యత్వం మెరుగుపడేటట్లు లేదని భావించడం జరుగుతోంది.  అందువల్ల, విద్యుత్తు సరఫరా ను కొనసాగించడం కోసం విద్యుత్తు రంగం లో ద్రవ్యత్వాన్ని కల్పించవలసిన తక్షణ అవసరం ఉంది.  



***


(Release ID: 1647039) Visitor Counter : 198