గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో వృద్ధి

2020 జూన్ మాసానికి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, వినియోగ- ఆధారిత సూచీల ప్రాథమిక

Posted On: 11 AUG 2020 5:33PM by PIB Hyderabad

పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) ప్రాథమిక అంచనాలు ప్రతి నెలా 12వ తేదీన (ఆ రోజు సెలవు అయితే దానికి ముందు పని దినాన) విడుదలవుతాయి. ఆరు వారాల ముందు ముగిసిన కాలానికి సంబంధించిన డేటాను వివిధ సమాచార సంస్థల నుంచి సేకరించి మందించడం జరుగుతుంది. ఆయా సంస్థలు ఫ్యాక్టరీలు/ ఉత్పత్తి సంస్థల నుంచి డేటాను సేకరిస్తాయి.

కోవిడ్-19 మహమ్మారిని వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యలు, ప్రకటించిన దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగా... పెద్ద సంఖ్యలో పారిశ్రామిక రంగంలోని సంస్థలు 2020 మార్చి చివరి నుంచి పని చేయడం లేదు. ఆయా సంస్థలు ఉత్పత్తి చేసే సరుకులపైన లాక్ డౌన్ కాలంలో ఈ ప్రభావం పడింది. ఆ తర్వాత కాలంలో ఆంక్షలను ఎత్తివేయడంతో, పారిశ్రామిక కార్యకలాపాలు పున: ప్రారంభమవుతున్నాయి. 2020 ఏప్రిల్, మే మాసాల్లో వరుసగా 53.6, 89.5 లకు పరిమితమైన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 2020 జూన్ మాసానికి 107.8కి పెరిగింది.

2011-12 ప్రామాణిక సంవత్సరంగా 2020 జూన్ మాసానికి మదించిన ప్రాథమిక అంచనాల ప్రకారం, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 107.8. జూన్ మాసంలో మైనింగ్, తయారీ, విద్యుత్ రంగాలకు సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీలు వరుసగా 85.4, 106.9, 156.2 (స్టేట్ మెంట్ 1). ఈ ప్రాథమిక అంచనాలను... తర్వాతి ప్రకటనల సమయానికి ఐఐపి సమీక్షా విధానానికి అనుగుణంగా సవరించడం జరుగుతుంది.

వినియోగ- ఆధారిత వర్గీకరణ ప్రకారం చూస్తే... 2020 జూన్ మాసానికి ఉత్పత్తి సూచీ ప్రాథమిక సరుకులకు 109.2గా, ఉత్పాదక సరుకులకు 64.3గా, మధ్య తరహా సరుకులకు 102.2గా ఉంది. మౌలిక సదుపాయాల కల్పన/ నిర్మాణ రంగంలో సూచీ 110.7 వద్ద నిలిచింది (స్టేట్ మెంట్ 3). దీర్ఘకాలం మనగలిగే వస్తువుల విషయంలో 77.4గా ఉన్న సూచీ, నిత్యావసరాల వంటి స్వల్ప కాల సరుకులకు 157.3 వద్ద నిలిచింది.

జాతీయ పారిశ్రామిక వర్గీకరణ (ఎన్.ఐ.సి -2008) లోని రంగాల, రెండంకెల స్థాయిలోనూ, వినియోగ- ఆధారిత వర్గీకరణ ప్రకారమూ... 2020 జూన్ మాసపు పారిశ్రామిక ఉత్పత్తి సూచీల ప్రాథమిక అంచనాలు వరుసగా స్టేట్ మెంట్ 1, 2, 3 లలో ఇవ్వబడ్డాయి. 2020 ఏప్రిల్ నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలలో ప్రస్తావించినట్లుగా... కోవిడ్-19 మహమ్మారి ప్రభావిత నెలల్లోని పారిశ్రామిక ఉత్పత్తి సూచీలను మహమ్మారికి పూర్వపు మాసాల్లో నమోదైన ఐఐపితో పోల్చడం సరి కాదు. తయారీ రంగంలో వచ్చిన మార్పులను వినియోగదారులు గమనించడానికి గాను 2020 ఏప్రిల్ నుంచి నెల వారీగా పరిశ్రమ గ్రూపుల వారీగా (2008 జాతీయ పారిశ్రామిక వర్గీకరణ లోని రెండంకెల స్థాయి ప్రకారం) సూచీలతో అదనంగా స్టేట్ మెంట్ 4 ఇవ్వబడింది.

2020 జూన్ మాసపు ఐఐపి ప్రాథమిక అంచనాలతో పాటు... 2020 మే నెల సూచీలకు తొలి సవరణ, 2020 మార్చి నెల ఐఐపికి తుది సవరణ చేయడం జరిగింది (వివిధ సంస్థల నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం).

2020 జూలై పారిశ్రామిక ఉత్పత్తి సూచీ సెప్టెంబర్ 11న (శుక్రవారం) విడుదలవుతుంది.

నోట్:-

  1. ఈ పత్రికా ప్రకటన సమాచారం సంబంధిత మంత్రిత్వ శాఖ వెబ్సైట్ http://www.mospi.nic.in లోనూ ఉంది.
  2. హిందీలో పత్రికా ప్రకటన http://mospi.nic.in/hi లింకులో అందుబాటులో ఉంది.

 

***

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1645268) Visitor Counter : 145


Read this release in: English , Hindi , Tamil