కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

అండమాన్ & నికోబార్ దీవుల కు (సిఎఎన్ఐ) సబ్ మరీన్ కేబుల్ కనెక్టివిటీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ మోదీ

ఈ సంధానం అండమాన్ & నికోబార్ దీవుల లో అవకాశాల ను ప్రోత్సహించగలదన్న ప్రధాన మంత్రి

వ్యాపారం లో సౌలభ్యాన్ని ప్రోత్సహించడం, ఇంకా సముద్ర సంబంధి లాజిస్టిక్స్ ను సరళతరం గా మార్చడం పై ప్రభుత్వం శ్రద్ద వహిస్తోంది: ప్రధాన మంత్రి

నౌకాశ్రయాల నాయకత్వం లో అభివృద్ధి కి నిలయం గా ఉన్నతి ని సాధించనున్న అండమాన్ & నికోబార్ దీవులు: ప్రధాన మంత్రి

అంతర్జాతీయ సముద్ర సంబంధి వర్తకానికి ఒక ప్రధాన కేంద్రం గా ఎదగనున్న అండమాన్ & నికోబార్ దీవులు: ప్రధాన మంత్రి

Posted On: 10 AUG 2020 12:52PM by PIB Hyderabad

అండమాన్ & నికోబార్ దీవుల ను ప్రధాన భూమి తో కలిపే సబ్ మరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎఫ్ సి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ప్రారంభించి మరి ఆ సదుపాయాన్ని దేశ ప్రజల కు అంకితమిచ్చారు.  ఈ పరియోజన కు పోర్ట్ బ్లేయర్ లో 2018వ సంవత్సరం లో డిసెంబర్ 30 వ తేదీ నాడు ప్రధాన మంత్రి యే శంకుస్థాపన చేశారు.  

ఈ సంధానం ఇక ఈ ద్వీపాల లో అనంతమైనటువంటి అవకాశాల ను కల్పిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  2300 కి.మీ. సబ్ మరీన్ కేబుల్ ను వేయడం, మరి దీనికి సంబంధించిన పనులను నిర్దేశిత లక్ష్యం కంటే ముందుగానే పూర్తి చేయడం ప్రశంసనీయమని ఆయన అన్నారు. 

చెన్నై నుండి పోర్ట్ బ్లేయర్ వరకు, పోర్ట్ బ్లేయర్ నుండి లిటిల్ అండమాన్, ఇంకా పోర్ట్ బ్లేయర్ నుండి స్వరాజ్ ఐలండ్ వరకు గల దీవుల లో ఒక చాలా పెద్ద భాగం లో ఈ యొక్క సేవ ఈ రోజు నుండి ప్రారంభం అయిందని ప్రధాన మంత్రి అన్నారు.

సముద్రం లోని లోతట్టు ప్రాంతం లో సర్వేక్షణ ను చేపట్టడం, కేబుల్ యొక్క నాణ్యత ను పరిరక్షించడం మరియు స్పెశలైజ్ డ్ వెసల్స్ తో కేబుల్ ను వేయడం వంటి కార్యభారాలు ఏమంత సులువైనవి కావు అందువల్ల సముద్రం లో దాదాపు 2300 కిలోమీటర్ల దిగువన కేబుల్స్ ను వేయడాన్ని మెచ్చుకోవలసిందే అని ప్రధాన మంత్రి అన్నారు.  ఉవ్వెత్తున ఎగసిపడే అలలు, తుపానులు మరియు రుతుపవనాల వంటి సవాళ్ల ను అధిగమించవలసి ఉంటుందని, కరోనా విశ్వమారి నేపథ్యం లో కష్ట కాలాలు ఎదురయ్యాయని ఆయన అన్నారు. 

అండమాన్ & నికోబార్ దీవులు చాలా సంవత్సరాలు గా దీని యొక్క ఆవశ్యకత ను గమనించినప్పటికీ ఈ అవసరాన్ని తీర్చడం కోసం ఎటువంటి చర్యల ను చేపట్టడం జరుగలేదు అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రధానమైనటువంటి సవాళ్ల కు ఎదురీది ఈ పరియోజన ను అప్పగించగలగడం పట్ల శ్రీ మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

అండమాన్ & నికోబార్ దీవుల లో నివసిస్తున్న ప్రజల కు తక్కువ ఖర్చు తో కూడినటువంటి మరియు ఉత్తమమైనటువంటి సంధానం సదుపాయాన్ని సమకూర్చడం అనేది దేశం యొక్క బాధ్యత గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పరియోజన తో అనుబంధితులైన వారందరి ని ఆయన అభినందించారు.  అండమాన్ & నికోబార్ దీవులు దిల్లీ కి మరియు ప్రధాన భూమి యొక్క హృద‌యాల కు ఏమంత దూరం లో లేవు సుమా అని రుజువు చేసిన అట్లాంటి ఒక ప్రయాసే ఈ యొక్క సబ్ మరీన్ కేబుల్ అని శ్రీ మోదీ అభివర్ణించారు.  

ప్రతి ఒక్క పౌరుని కి, ప్రతి ఒక్క పౌరురాలి కి జీవించడం లో సౌలభ్యం

దేశం లో ప్రతి ఒక్క పౌరుని కి/ప్రతి ఒక్క పౌరురాలి కి, అలాగే ప్రతి ఒక్క రంగాని కి కూడాను ఆధునిక సదుపాయాల ను సమకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తద్ద్వారా జీవించడం లో సౌలభ్యం మెరుగుపడగలదని శ్రీ మోదీ అన్నారు.  అండమాన్ & నికోబార్ దీవుల ను దేశం లోని మిగిలిన ప్రాంతాల తో కలిపే ఈ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు జీవించడం లో సౌలభ్యం దిశ గా ప్రభుత్వం యొక్క నిబద్దత కు ఒక ఉదాహరణ గా నిలుస్తున్నదని ఆయన అన్నారు.  జాతీయ భద్రత తో ముడిపడ్డ సరిహద్దు ప్రాంతాలు మరియు ద్వీప రాష్ట్రాల ను శరవేగం గా అభివృద్ధిపరచేందుకు ప్రభుత్వం వచనబద్ధమైందని ఆయన చెప్పారు. 


డిజిటల్ ఇండియా ద్వారా అవకాశాల పెరుగుదల

అండమాన్ & నికోబార్ దీవులు చౌక అయినటువంటి మరియు ఉత్తమమైనటువంటి సంధానాన్ని పొందడం లో, మరి డిజిటల్ ఇండియా యొక్క సకల ప్రయోజనాలు ప్రత్యేకించి ఆన్ లైన్ ఎజుకేశన్, టెలి-మెడిసిన్, బ్యాంకింగ్ వ్యవస్థ, ఆన్ లైన్ ట్రేడింగ్ ను మెరుగుపరచడం లో, అలాగే పర్యటన రంగానికి ఉత్తేజాన్ని ఇవ్వడం లో సబ్ మరీన్ కేబుల్ సహాయకారి కాగలదని ప్రధాన మంత్రి అన్నారు. 

భారతదేశం యొక్క వర్తకానికి మరియు వ్యూహాత్మకమైన పరాక్రమాని కి వేల సంవత్సరాలు గా హిందూ మహాసముద్రం కేంద్ర స్థానం గా ఉందని, అదే మాదిరి గా అండమాన్ & నికోబార్ దీవులు భారతదేశం యొక్క ఆర్థిక, వ్యూహాత్మక సహకారానికి ఒక ముఖ్య కేంద్రం గా ఉంటున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. 

ఇండో-పసిఫిక్ ప్రాంతం లో భారతదేశం అవలంబించే నూతన వర్తక వ్యూహం లో భారతదేశం యొక్క ద్వీపాలు అన్నీ కూడాను ఒక ముఖ్య పాత్ర ను పోషించగలవని ఆయన అన్నారు.
  
యాక్ట్- ఈస్ట్ పాలిసి లో భాగం గా, తూర్పు ఆసియా దేశాల తోను, సముద్రం తో జతపడ్డ ఇతర దేశాల తోను భారతదేశం యొక్క బలమైన సంబంధాల లో అండమాన్ & నికోబార్ దీవుల పాత్ర ఎంతో ఉన్నతమైంది, మరి ఇది పెరగనుంది కూడా అని శ్రీ మోదీ అన్నారు. 

ఈ దీవుల యొక్క పాత్ర ను బలపరచడం కోసం 3 సంవత్సరాల క్రితం ఐలండ్ డివెలప్ మెంట్ ఏజెన్సీ ని ఏర్పాటు చేయడమైంది అని ఆయన చెప్పారు.  అండమాన్ & నికోబార్ దీవుల లో పూర్తి కానటువంటి పరియోజనలు ఇప్పుడు శీఘ్ర గతి న పూర్తి అవుతున్నాయి అని ఆయన అన్నారు. 


అధిక ప్రభావశీల పరియోజన లు మెరుగైన భూమి, వాయు మార్గాలు మరియు జలమార్గాలు


అండమాన్ & నికోబార్ లోని 12 దీవుల లో అధిక ప్రభావశీల పరియోజన లను విస్తరించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.  మెరుగైనటువంటి ఇంటర్ నెట్, ఇంకా మొబైల్ కనెక్టివిటి ని సమకూర్చడం తో పాటు రోడ్డు, వాయు మరియు జల మార్గాల ద్వారా భౌతిక సంధానాన్ని మరింత గా మెరుగుపరచే ప్రయాస కూడా జరుగుతున్నదని ఆయన తెలిపారు.

ఉత్తర అండమాన్ మరియు మధ్య అండమాన్ లో రోడ్డు సంధానాన్ని మెరుగుపరచడం కోసం ఎన్ హెచ్-4 ను వెడల్పు చేసే పనుల కు తోడు రెండు ప్రధానమైన వంతెన ల పనులు జరుగుతుండటాని ఆయన ప్రస్తావించారు.
 
ఒకే సారి 1200 ప్రయాణికుల ను హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని సంతరిస్తూ పోర్ట్ బ్లేయర్ విమానాశ్రయం యొక్క స్థాయి ని పెంచడం జరుగుతోందని ఆయన అన్నారు.  దీనితో పాటు దిగ్లీపుర్, కార్ నికోబార్ మరియు క్యాంప్ బెల్ - బే లలో విమానాశ్రయాలు కార్యకలపాల ను నిర్వహించడం కోసం సిద్దం గా ఉన్నాయన్నారు. 


స్వరాజ్ ద్వీప్, శహీద్ ద్వీప్ మరియు లాంగ్ ఐలండ్ లలో ప్యాసింజర్ టర్మినల్ తో పాటు ఫ్లోటింగ్ జెట్టీ వంటి వాటర్ ఏరోడ్రోమ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కూడా రాబోయే మాసాల లో తయారు అవుతాయని శ్రీ మోదీ తెలిపారు.

కోచి శిప్ యార్డ్ లో నిర్మాణం లో ఉన్నటువంటి 4 నౌకల ను ద్వీపాల కు మరియు ప్రధాన భూమి కి నడుమ న జల సంధానాన్ని మెరుగుపరచడం కోసం త్వరలో అప్పగించడం జరుగుతుందని ఆయన అన్నారు.  


నౌకాశ్రయాల నాయకత్వం లో అభివృద్ధి

ప్రపంచం లోని అనేక నౌకాశ్రయాల కంటే అండమాన్ & నికోబార్ దీవులు స్పర్ధాత్మక దూరం లో ఉన్నందువల్ల, నౌకాశ్రయాల నాయకత్వం లో అభివృద్ధి కి నిలయం గా అండమాన్ & నికోబార్ దీవుల ను తీర్చిదిద్దడం జరుగుతుందని ఆయన చెప్పారు.  

మెరుగైన నౌకాశ్రయాల నెట్ వర్క్ మరియు ఆ నౌకాశ్రయాల సంధాన సౌకర్యాలు ఏ దేశం లో ఉంటాయో ఆ దేశం 21వ శతాబ్దం లో వర్తకానికి ఒక ఉత్తేజాన్ని అందించగలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. 

స్వయం సమృద్ధి సాధన సంకల్పం తో  భారతదేశం ముందుకుపోతూ, గ్లోబల్ సప్లయ్ చైన్ లోను, గ్లోబల్ వేల్యూ చైన్ లోను ఒక ముఖ్య పాత్రధారి గా తనను తాను ప్రతిష్ఠితం చేసుకొంటున్న ప్రస్తుత తరుణం లో మన జలమార్గాలు మరియు నౌకాశ్రయాల యొక్క నెట్ వర్క్ ను పటిష్టం చేసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.  నౌకాశ్రయాల సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన యొక్క అభివృద్ధి లో న్యాయపరంగా ఎదురవుతున్న అడ్డంకుల ను కూడా ను అదే పని గా తొలగించడం జరుగుతున్నది అని శ్రీ మోదీ చెప్పారు.  


అంతర్జాతీయ సముద్ర సంబంధి వ్యాపారం

సముద్రం లో వ్యాపార నిర్వహణ సంబంధిత సౌలభ్యాన్ని ప్రోత్సహించడం, ఇంకా మేరిటైం లాజిస్టిక్స్ ను సరళతరం చేయడం పైన కూడా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.  డీప్ డ్రాఫ్ట్ ఇన్నర్ హార్బర్ ను త్వరిత గతి న నిర్మించడాన్ని గురించి మరియు గ్రేట్ నికోబార్ లో ట్రాన్స్ శిప్ మెంట్ పోర్ట్ ను దాదాపు గా 10,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించే ప్రతిపాదన ను గురించి ఆయన ప్రస్తావించారు. దీని తో పెద్ద ఓడ లు లంగరు వేసుకు ఆగేందుకు వీలు కలుగుతుందని, మరి నూతన ఉద్యోగ అవకాశాల తో పాటు సముద్ర సంబంధి వ్యాపారం లో భారతదేశం యొక్క వాటా కూడా పెరుగుతుందని శ్రీ మోదీ అన్నారు. 

అండమాన్ & నికోబార్ దీవుల లో అభివృద్ధిపరుస్తున్న ఆధునిక మౌలిక సదుపాయాల కు సమానమైన రీతి లో మత్స్యపరిశ్రమ, చేపలు/రొయ్యల పెంపకం, ఇంకా సముద్రపు కలుపుమొక్కల సాగు వంటి నీలి ఆర్థిక వ్యవస్థ వేగం గా వృద్ధి చెందగలదని ఆయన అన్నారు.  ప్రభుత్వం యొక్క కృషి అండమాన్ & నికోబార్ దీవుల కు ఒక్క నూతన సదుపాయాల ను అందించడమే కాకుండా ప్రపంచ పర్యటక పటం లో ఓ ప్రముఖ స్థానాన్ని కూడా కట్టబెట్టగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

 

***(Release ID: 1644804) Visitor Counter : 273