యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ డిప్ల‌మా పాఠ్య‌ప్ర‌ణాళిక పునఃరూప‌క‌ల్ప‌న‌, ఎన్‌సిఎస్‌సి ఫాక‌ల్టీని బ‌లోపేతం చేయ‌డం పై ఎస్‌.ఎ. అక‌డ‌మిక్ కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యాలు

Posted On: 06 AUG 2020 6:13PM by PIB Hyderabad

దేశంలో బ‌ల‌మైన  క్రీడా వాతావ‌ర‌ణానికి , క్రీడలకు శిక్ష‌ణ  అనేది ఒక ముఖ్య‌మైన అంశం. క్రీడ‌ల శిక్ష‌ణ‌ను క్షేత్ర స్థాయిలో, ఉన్న‌త స్థాయిలో మ‌రింత ముందుకు తీసుకుపోయేందుకు స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా  27 వ అక‌డ‌మిక్ కౌన్సిల్‌, ఇటీవ‌ల జ‌రిగిన  కౌన్సిల్  స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

ఇప్ప‌టికే ఉన్న నేష‌నల్ సెంట‌ర్ ఫ‌ర్ స్పోర్ట్సు కోచింగ్ (ఎన్‌సిఎస్‌సి)ని బ‌లోపేతం చేసి, క్రీడావిశిష్ఠ‌‌త‌ను పెంపొందించే ఉద్దేశంతో,అలాగే క్రీడాకారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా కోచ్‌లకు నూత‌న నైపుణ్యాల‌ను అందించేందుకు నిర్ణ‌యాలు తీసుకున్నారు.
కౌన్సిల్ స‌మావేశంలో తీసుకున్న‌కీల‌క నిర్ణ‌యాలు కింది విధంగా ఉన్నాయి:

1)అంత‌ర్జాతీయ క్రీడా వాతావర‌ణానికి అనుగుణంగా , భార‌తీయ కోచ్‌లు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు ధీటుగా  క్రీడాకారుల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు వీలుగా , సిల‌బ‌స్ తీరు, ఎన్‌.ఎస్‌,ఎన్ .ఎస్‌,  పాటియాలాలోని  ముఖ్య‌మైన కోర్సుల లోని అంశాలు, క్రీడా శిక్ష‌ణ‌లోని డిప్ల‌మా కోర్సు ను, క్రీడా రంగానికి చెందిన నేష‌న‌ల్ స్పోర్టింగ్ ఫెడ‌రేష‌న్లు, సంబంధిత వ‌ర్గాల వారితో విస్తృత సంప్ర‌దింపులు జ‌రిపిన మీద‌ట రివైజ్ చేయ‌డం జరిగింది. కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా డిప్ల‌మా కోర్సు మొద‌టి సెమిస్ట‌ర్‌ను ఆన్ లైన్ లో నిర్వ‌హించాలని నిర్ణ‌యించారు.

2)  పాటియాలా, కోల్‌క‌తా , బెంగ‌ళూరు, త్రివేండ్రం ల‌లో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా కి చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్సు ల‌లో ఫాక‌ల్టీ నాణ్య‌త‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకునేందుకు ఒక నిపుణుల స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈనిపుణుల క‌మిటీ ప్ర‌స్తుతం ఉన్న ఫాక‌ల్టీని ప‌రిశీలించి నూత‌న‌, భ‌విష్య‌త్ ఫాక‌ల్టీ, గెస్ట్ టీచ‌ర్ల‌కు సంబంధించి సిఫార్సులు చేస్తుంది. దీనివ‌ల్ల  నిపుణుల సేవ‌ల వినియోగించుకోవ‌డ‌మే కాకుండా దేశంలోని అత్యుత్త‌మ ఫాక‌ల్టీసేవ‌లు కోర్సులో శిక్ష‌ణ పొందుతున్న వారు వినియోగించుకోవ‌డానికి వీలు క‌లుగుతుంది.

3) ప్ర‌స్తుత‌కోవిడ్ -19 ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని , క్షేత్ర‌స్థాయిలో,కోచ్‌ల అభివృద్ధి కోసం
 ఆరు వారాల స‌ర్టిఫికేట్ కోర్సును కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు.

 ఈ నిర్ణ‌యాలపై, సీనియ‌ర్ ఎక్జిక్యుటివ్ డైర‌క్ట‌ర్ (అక‌డ‌మిక్స్‌)  క‌ల్న‌ల్ ఆర్‌.ఎస్‌.బిష్ణోయ్ మాట్లాడుతూ,
ఎస్‌.ఎ.ఐలోని అక‌డ‌మిక్ వ్య‌వ‌స్థ స్థాయిని ప్ర‌స్తుతం రూపుదిద్దుకుంటున్న క్రీడా వాతావ‌ర‌ణానికి అనుగుణంగా  పెంచేందుకు కౌన్సిల్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు.  డిప్ల‌మా ఇన్ స్పోర్ట్సు కోచింగ్ ప్రోగ్రామ్‌కు దేశ‌వ్యాప్తంగా గ‌ల అత్యుత్త‌మ ఫాక‌ల్టీ సేవ‌ల‌ను వినియోగించుకోవాలని కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఈ నిర్ణ‌యాలు , ఇండియాలో క్రీడ‌ల శిక్ష‌ణా విద్య , అన్ని స్థాయిల‌లో క్రీడా విశిష్ట‌త‌కు దోహ‌ద‌ప‌డ‌గ‌లవ‌‌ని చెప్పారు.


 

*******

 



(Release ID: 1644109) Visitor Counter : 98