నీతి ఆయోగ్

భారత్‌-అమెరికా వ్యూహాత్మక శక్తి భాగస్వామ్యం: ఈనెల 2న ప్రారంభమైన 'సస్టెయినబుల్‌ గ్రోత్‌ పిల్లర్ ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరం'

Posted On: 15 JUL 2020 5:06PM by PIB Hyderabad

'సస్టెయినబుల్‌ గ్రోత్‌ పిల్లర్‌' అనేది, భారత్‌-అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యంలో అతి ముఖ్యమైన మూలస్తంభం. నీతి ఆయోగ్, యూఎస్‌ఏఐడీ దీనికి సహాధ్యక్షులు. శక్తి సమాచార నిర్వహణ, శక్తి మోడలింగ్, తక్కువ కర్బన పరిజ్ఞానంపై సహకారం దీని కీలక కార్యకలాపాలు.

    ఈనెల 2న జరిగిన ఎస్‌జీ పిల్లర్‌ సంయుక్త కార్యాచరణ బృందం సమావేశంలో, 'ఇండియా ఎనర్జీ మోడలింగ్‌ ఫోరమ్‌' ప్రారంభమైంది. 

    శక్తి మోడలింగ్ ఫోరంలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. 'ది ఎనర్జీ మోడలింగ్‌ ఫోరం' (ఈఎంఎఫ్‌)ను అమెరికాలో 1976లో, స్టాన్‌పోర్డ్‌ విశ్వవిద్యాలయంలో స్థాపించారు. ప్రభుత్వం, పారిశ్రామిక రంగం, విశ్వవిద్యాలయాలు, ఇతర పరిశోధన సంస్థలకు చెందిన మోడలింగ్‌ నిపుణులు, నిర్ణేతలను అనుసంధానించడానికి దీనిని ఏర్పాటు చేశారు. శక్తి, పర్యావరణం చుట్టూ ఉన్న సమకాలీన సమస్యలను చర్చించడానికి నిష్పాక్షిక వేదికను ఈ ఫోరం అందిస్తుంది.

    మోడలింగ్ ఫోరం ఏర్పాటుకు భారతదేశంలో అధికారిక, క్రమబద్ధ ప్రక్రియ లేదు. అయినా, టీఈఆర్‌ఐ, ఐఆర్‌ఏడీఈ, సీఎస్‌టీఈపీ, సీఈఈడబ్ల్యూ, ఎన్‌సీఏఈఆర్‌ వంటి మేధో, పరిశోధన సంస్థలు పరిస్థితులను స్థిరంగా అభివృద్ధి చేయడంతోపాటు.., మోడలింగ్ అధ్యయనాలు, విశ్లేషణల ద్వారా, 'కేంద్ర పర్యావరణం, అడవుల శాఖ', నీతి ఆయోగ్‌ సహా ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. 

'ది ఇండియా ఎనర్జీ మోడలింగ్‌ ఫోరం' ఈ క్రింది ప్రయత్నాలను వేగవంతం చేయడంతోపాటు లక్ష్యంగా చేసుకుంటుంది:

కీలకమైన శక్తి, పర్యావరణ సంబంధిత సమస్యలను పరిశీలించడానికి ఒక వేదికను అందిస్తుంది.
నిర్ణయాలు తీసుకునే విధానాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేస్తుంది.
మోడలింగ్ బృందాలు, ప్రభుత్వం, విజ్ఞాన భాగస్వాములు, పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంచుతుంది.
ఆలోచనల మార్పిడిని సులభతరం చేయడంతోపాటు, అధిక నాణ్యతతో కూడిన కొత్త అధ్యయనాలు వచ్చేలా చేస్తుంది.
వివిధ స్థాయులు, విభాగాల్లోని విజ్ఞాన అంతరాలను గుర్తిస్తుంది.
భారతీయ సంస్థల సామర్థ్యాన్ని పెంచుతుంది.

    ఫోరం కార్యకలాపాలను నీతి ఆయోగ్‌ ప్రాథమికంగా సమన్వయం చేయడంతోపాటు పాలన విధానాన్ని ఖరారు చేస్తుంది. విజ్ఞాన భాగస్వాములు, సమాచార సంస్థలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు ఈ ఫోరంలో ఉంటాయి.

 

***

 (Release ID: 1638847) Visitor Counter : 92