జల శక్తి మంత్రిత్వ శాఖ

మణిపూర్ ముఖ్యమంత్రితో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి వీసీ స‌మావేశం

2022 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ గృహాలకు కుళాయి స‌దుపాయం

Posted On: 09 JUL 2020 3:31PM by PIB Hyderabad

కేంద్ర జల్ శక్తి శాఖ‌ మంత్రి శ్రీ గజేంద్ర శేఖావత్, మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరెన్ సింగ్‌తో దృశ్య మాధ్య‌మిక వేదిక ద్వారా (వీడియో కాన్ఫరెన్స్‌) ఒక స‌‌మావేశం నిర్వ‌హించారు. జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో చర్చించారు. గ్రామాల‌లో ఇంటింటికీ కుళాయి స‌దుపాయాన్ని క‌ల్పించ‌డంతో పాటుగా..రాష్ట్రాల నీటి సరఫరా పథకాల గురించి విశ్లేషించేందుకు గాను కేంద్ర జ‌ల్ శ‌క్తి మంత్రిత్వ శాఖ‌లోని తాగు నీరు మరియు పారిశుద్ధ్య శాఖ గ‌డిచిన మూడు నెలలుగా రాష్ట్రాలు / ‌కేంద్ర పాలిత ప్రాంత‌ల వారితో విస్తృతంగా సంప్ర‌దింపులు జ‌రుపుతూ వ‌స్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర జల్ శక్తి శాఖ‌ మంత్రి శ్రీ గజేంద్ర శేఖావత్ తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరెన్ సింగ్‌తో వీసీ స‌మావేశం నిర్వ‌హించారు. దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి తాగునీరు నిమిత్తం త‌గిన నీటి స‌ర‌ఫ‌రా ఉన్న కుళాయి స‌దుపాయం (ఎఫ్‌హెచ్‌టిసి) ఉండేలా చూసేందుకు గాను భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాల వారి భాగస్వామ్యంతో 'జల్ జీవన్ మిషన్‌' అనే ప్ర‌ధాన‌ కార్య‌క్ర‌మాన్ని అమలు చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు సరసమైన సేవా డెలివరీ ఛార్జీలతో నిరంత‌రాయంగా మరియు దీర్ఘ కాలిక ప్రాతిపదికన తగిన పరిమాణంలో గ్రామీణుల‌కు త్రాగునీరు అందిచ‌డంతో పాటు వారి జీవన ప్రమాణాలలో మెరుగుదలే ల‌క్ష్యంగా 'జల్ జీవన్ మిషన్‌' కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ప్రస్తుత కోవిడ్ - 19 పరిస్థితిలో గ్రామీణ గృహాల‌కు కుళాయి స‌దుపాయాన్ని ప్రాధాన్యత ప్రాతిపదికన అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం చేస్తోంది. దీని వ‌ల్ల గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు నీటిని తీసుకురావడానికి సామూహిక‌ కుళాయిల (స్టాండ్-పోస్టులకు) వ‌ద్ద‌కు వెళ్లవలసిన అవసరం లేకుండా చేయాల‌న్న‌ది స‌ర్కారు ల‌క్ష్యం.

2022 నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు కుళాయి స‌దుపాయం క‌ల్పిస్తామ‌ని సీఎం హామీ
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలు‌ పైపు నీటి సరఫరా ద్వారా ఈ ప‌థ‌కంలో కవర్ చేయబడతాయి. తద్వారా పేద మరియు అట్టడుగు వ‌ర్గం ప్రజలు త‌మ ఇంటి ప్రాంగణంలోనే కుళాయి కనెక్షన్లు పొంద‌గ‌లుగుతారు. ఈ నేప‌థ్యంలో 2024 నాటికి దేశంలోని మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాల‌కు త‌గిన కుళాయి స‌దుపాయం క‌ల్పించాల‌న్నది జాతీయ ల‌క్ష్యం. కాగా.. మ‌ణిపూర్ 2021- 22 నాటికే రాష్ట్రంలోని నూటికి నూరు శాతం కుళాయి స‌దుపాయం అందించి జాతీయ ల‌క్ష్యం కంటే ముందే ల‌క్ష్యాన్ని చేరేలా ప్రణాళిక‌లు రూపొందిస్తోంది.  ఇలా చేయడం ద్వారా, ప్రతి గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్ అందించే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించిన ఈశాన్యంలో మొట్టమొదటి రాష్ట్రంగా మణిపూర్ రాష్ట్రం నిలువ‌నుంది.
నీటి నిర్వ‌హ‌ణ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాలి..
మణిపూర్ రాష్ట్రంలో 4.51 లక్షల గ్రామీణ గృహాలు ఉండగా.. వీటిలో 0.32 లక్షల‌కు (7.17%) ఎఫ్‌హెచ్‌టీజీలు ఉన్నాయి. మిగిలిన 4.19 లక్షల గృహాల‌కు 2020-21 ఏడాది 2 లక్షల గృహాల‌కు కుళాయి కనెక్షన్లు అందించాలని మణిపూర్ యోచిస్తోంది. ప్రస్తుత సంవత్సరం ఒక‌ జిల్లా మరియు 15 బ్లాక్స్ మరియు 1,275 గ్రామాలకు నూటికి నూరు శాతం కుళాయి స‌దుపాయం క‌ల్పించాల‌ని ఈ రాష్ట్రం యోచిస్తోంది. 2020-21లో ఇందుకు రూ.1 131.80 కోట్ల నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ‌పు వాటా క‌లుపుకొని రూ.216.2 కోట్ల మేర నిధుల లభ్యత రాష్ట్ర ప్ర‌భుత్వానికి అందుబాటులో ఉండ‌నుంది. భౌతిక, ఆర్థిక పనితీరు ఆధారంగా
రాష్ట్రానికి అదనపు కేటాయింపులు ఉంటాయి. 15వ ఆర్థిక కమిషన్ నిధుల కింద రూ.177 కోట్ల మేర నిధులు పీఆర్ఐల‌కు కేటాయించ‌బ‌డ్డాయ‌ని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందు‌లో దాదాపు 50 శాతం వ‌ర‌కు నిధుల‌ను నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం కోసం ఉపయోగించాల్సి ఉన్నందున నిధుల్ని గ్రామీణ నీటి సరఫరా, మురుగు నీరు నిర్వహణ కోసం ఉపయోగించుకునేలా ప్రణాళిక చేయాలని కేంద్ర మంత్రి మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రిని అభ్యర్థించారు. ముఖ్యంగా నీటి సరఫరా పథకాల యొక్క దీర్ఘకాలిక నిర్వ‌హ‌ణ‌ను నిర్ధారించేందుకు ఈ నిధుల‌ను వినియోగించాల‌ని ఆయ‌న కోరారు. గ్రామ పంచాయతీ యొక్క ఉప కమిటీగా కనీసం 50 శాతం మహిళా సభ్యులతో గ్రామ నీటి & పారిశుద్ధ్య కమిటీ / పానీ
స‌మితీల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రి మ‌ణిపూర్ సీఎంకు సూచించారు.
ఈ క‌మిటీలు గ్రామ నీటి ప్రణాళికల‌ రూపకల్పన, అమలు మరియు నిర్వహణతో పాటుగా గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా మౌలిక వ‌స‌తుల నిర్వహణపు బాధ్యతల్ని స‌ద‌రు  క‌మిటీకి అప్ప‌గించాల‌ని సూచించారు. అన్ని గ్రామాలు విలేజ్ యాక్షన్ ప్లాన్ (వీఏపీ) ల‌ను సిద్ధం చేయవలసిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇది తాగు నీటి వనరుల అభివృద్ధి / వృద్ధి, నీటి సరఫరా, స‌రైన మురుగు నీటి నిర్వహణ మరియు ఇత‌ర అన్ని విధాల నీటి నిర్వహణ అంశాల‌ను ఇది కలిగి ఉంటుంద‌ని
తెలియ‌జేయ‌డ‌మైంది. జల్ జీవన్ మిషన్‌ను ప్రజల ఉద్యమంగా మార్చడానికి మిషన్‌పై అవిభక్తమైన‌ దృష్టి పెట్ట‌డంతో పాటుగా సామాజిక ప‌ర‌‌మైన సమీకరణతో పాటు ఐఇసీ ప్రచారం చేపట్టాలని మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రి అభ్యర్థించారు. అన్ని తాగునీటి వనరుల్లో రసాయన పారామితులను గురించి తెలుసుకొనేందుకు గాను  ప్రతి సంవత్సరం రెండుసార్లు బాక్టీరియా కాలుష్య ప‌రిమాణ‌పు ప‌రీక్షల‌ను (రుతు పవనానికి ముందు మరియు త‌రువాత‌) జ‌ర‌పాల్సిన‌ అవసర‌ముందని ప్ర‌ధానంగా
ప్ర‌స్తావించ‌డ‌మైంది. క్షేత్రస్థాయి పరీక్షా వస్తు సామగ్రి (ఎఫ్‌టీకే) ద్వారా నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రతి గ్రామంలోనూ కనీసం ఐదుగురికి ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్య‌త‌నిస్తూ శిక్షణనివ్వాలని రాష్ట్రం కోరింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నెల‌కొని ఉన్న ప్ర‌స్తుత పరిస్థితిలో గ్రామీణ ప్రాంతాల‌లో గృహ కుళాయి స‌దుపాయాల‌ను అందించేందుకు చేస్తున్న‌‌ ప్రయత్నాలు క‌చ్చితంగా మహిళలు, బాలికల నీటి క‌ష్టాల‌ను దూరం చేయ‌డంతో పాటుగా.. వారు సురక్షిత‌, గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపేలా జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుచనుంది.
 
                                     *****


(Release ID: 1637734) Visitor Counter : 224