వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం-2020 జులై నుంచి నవంబర్ వరకు ఐదు నెలల కాలానికి అదనపు ఆహారధాన్యాల కేటాయింపు
Posted On:
08 JUL 2020 4:24PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ , ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) పొడిగింపునకు ఆమోదం తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి ఆర్థిక స్పందనలో భాగంగా కేంద్రపూల్ నుంచి 2020 జులై నుంచి నవంబర్ వరకు మరో ఐదు నెలల కాలానికి అదనపు ఆహారధాన్యాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
2020 మార్చి నెలలో భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ (పిఎంజికెపి)-1 ని ప్రకటించింది. దేశంలో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో పేదలకు ఎదురయ్యే ఇబ్బందులనుంచి వారిని గట్టెక్కించేందుకు దీనిని ప్రకటించారు.
ఈ ప్యాకేజ్ లో, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎం-జికెఎవై) అమలు ఇమిడి ఉంది. దీని ద్వారా ఉచితంగా ప్రతి వ్యక్తికి నెలకు 5 కెజిల వంతున అదనపు ఆహారధాన్యాలను( బియ్యం లేదా గోధుమలు) 2013 ఆహార భద్రతా చట్టం(ఎన్.ఎఫ్.ఎస్.ఎ) కింద లబ్దిదారులైన 81 కోట్ల మంది కి ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద తొలుత మూడు నెలల కాలానికి అంటే 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేశారు.
అయితే, పేదలు, అవసరమైన వారికి మద్దతు కొనసాగించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పిఎం-జికెఎవై పథకాన్ని మరో ఐదు నెలల కాలానికి అంటే 2020 జూలై నుంచి నవంబర్ వరకు పొడిగించడం జరిగింది.
ఇంతకుముందు, పిఎంజికెఎవై పథకం కింద, ఈ డిపార్టమెంట్ 30-03-2020న మొత్తం 120 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యానలను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మూడు నెలల కాలానికి పంపిణీ చేసేందుకు (2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు) కేటాయించింది. అందుకు అనుగుణంగా ఎఫ్.సి.ఐ ఇతర రాష్ట్ర ఏజెన్సీలు 120 లక్షల మెట్రిక్‌టన్నులలో (97 శాతం)116.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ప్రత్యేక పథకం కింద పంపిణీకి అందజేశాయి.
ఇప్పటివరకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సుమారు 107 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను ( అంటే 89 శాతం) 2020 ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు గల కాలానికి పంపిణీ చేశాయి. ఇప్పటి వరకు ఏప్రిల్ లో సుమారు 74.3 కోట్ల మంది లబ్ధిదారులు , మే నెలలో 74.75 కోట్ల మంది లబ్ధిదారులు, మే నెలలో 64.72 కోట్ల మంది లబ్ధిదారులు ఈ అదనపు ఉచిత ఆహారధాన్యాలను తీసుకుని ప్రయోజనం పొందారు. మామూలుగా తీసుకునే ఎన్.ఎఫ్.ఎస్.ఎ ఆహారధాన్యాలకు ఇవి అదనం. ఈ ఆహార ధాన్యాల పంపిణీ ఇంకా కొనసాగుతోంది. పంపిణీ పూర్తి అయిన తర్వాత గణాంకాలను తాజాగా సవరించడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు రవాణా తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని పిఎం-జికెఎవై ఆహారధాన్యాలను ఒకే సారి రెండు లేదా మూడు నెలల కాలానికి పంపిణీ చేశాయి.
రెగ్యులర్‌గా పంపిణీ చేసే ఎన్.ఎఫ్.సి.ఎ పథకం కింద 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సుమారు 252 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్.ఎఫ్.ఎస్.ఎ ధాన్యాలను , పిఎం-జికెఎవై ఆహారధాన్యాలను ఎఫ్.సి.ఐ సంస్థ దేశవ్యాప్తంగా తనకు గల పటిష్టమైన నెట్‌వర్క్ ద్వారా సమర్ధంగా తరలించింది. మారుమూల ప్రాంతాలు, అందుబాటులో లేని ప్రాంతాలకు విమాన సర్వీసులు, జలరవాణా మార్గాలను ఉపయోగించుకుని నిరంతరాయంగా ఆహారధాన్యాలను తరలించి, లబ్దిదారులకు అందజేసేట్టు అధికారులు చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్ పూర్తిగా అమలులో ఉన్న కాలంలోనూ సరఫరా చెయిన్ సమర్ధంగా నిర్వహించేట్టు చూడడం చెప్పుకోదగిన విషయం.
ఎన్.ఎఫ్.ఎస్.ఎ, అలాగే పిఎం-జికెఎవై పథకం కింద ఆహారధాన్యాలను లబ్దిదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా చూసేందుకు ఎఫ్.సి.ఐ , డిపార్టెమెంట్ చర్యలు తీసుకున్నాయి. దీనికితోడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) సంస్కరణలు,అంటే మొత్తం 5.4 లక్షల చౌకధరల దుకాణాల(ఎఫ్.పి.ఎస్‌ల)లో 90.3 శాతం అంటే సుమారు 4.88 లక్షల చౌకధరల దుకాణాల ఇపిఒఎస్ మెషిన్ నెట్ వర్క్ డిజిటలైజ్ అయింది. దీనితోపాటు లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ(టిపిడిఎస్) కు సంబంధించి ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ జరిగింది. అనేక రాష్ట్రాల్లో బయోమెట్రిక్ ద్వారా గుర్తింపు నిర్ధారణను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ప్రస్తుత పరీక్షా సమయంలో సరఫరా గొలుసు నిర్వహణ దాని సమర్ధతను చాటుకుంది.
2019 వ సంవత్సరం ఏప్రిల్- మే- జూన్ నెలలో ఈ డిపార్టమెంటు ఎన్.ఎఫ్.ఎస్.ఎ కింద మొత్తం 130.2 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను కేటాయించగా ఇందులో మొత్తం సుమారు 123 లక్షల మెట్రిక్ టన్నులు (95 శాతం ఆహారధాన్యాలను) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. 2020 సంవత్సరం అదే కాలంలో అంటే ఏప్రిల్-మే-జూన్ నెలలలో ఈ డిపార్టమెంట్ మొత్తం 252 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అదే లబ్ధిదారుల కోసం కేటాయించగా ( 132 లక్షల మెట్రిక్ టన్నులు ఎన్.ఎఫ్.ఎస్.ఎ కింద, మరో 120 లక్షల మెట్రిక్ టన్నులు పిఎంజికెఎవై కింద కేటాయించినవి), ఇందులో 247 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. వీటినుంచి 226 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను లబ్ధిదారులకు గత మూడు నెలల్లో పంపిణీ చేశారు. దీనిని బట్టి ప్రజలకు తగిన ఉపశమనం కలిగించడానికి సాధారణ స్థాయి కంటే రెట్టింపు మొత్తంలో ఆహారధాన్యాలను పంపిణీ చేయడం జరిగిందని తేలుతోంది.
పిఎంజికెఎవై ను మరో 5 నెలల కాలానికి అంటే 2020 నవంబర్ వరకు పొడిగిండం వల్,ల అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సరఫరా , పంపిణీని కొనసాగించడం జరుగుతుంది. దీనివల్ల ఆహార ధాన్యాల ఖరీదు, వాటి పంపిణీకి అయ్యే ఖర్చు అదనంగా రూ 76, 062 కోట్ల రూపాయలు కానుంది.
*************
(Release ID: 1637364)
Visitor Counter : 226