పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది
Posted On:
01 JUL 2020 5:55PM by PIB Hyderabad
భారతదేశం మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ చివరి వారాలలో కుదేలైతే , ఇప్పుడు పిఎస్‌యుల (ఐఒసి, బిపిసి, హెచ్‌పిసి) అమ్మకాల గణాంకాల ప్రకారం, జూన్ 20 లో దాని ప్రీ-లాక్‌డౌన్ స్థాయిలకు క్రమంగా చేరుతోంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగించే దేశమైన భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు 2007 నుండి కనిష్టానికి పడిపోయాయి, లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తివేయడం, దశలవారీగా ఆర్థిక వ్యవస్థను అన్‌లాక్ చేయడం ప్రారంభించడం, పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజల కదలికలను తిరిగి ప్రారంభించడానికి వీలు కల్పించడంతో, 2019 జూన్ (13.4 ఎంఎంటి) తో పోలిస్తే మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 2020 జూన్ (11.8 MMT) లో 88% కి చేరుకుంది. ఆర్థిక స్పెక్ట్రం అన్ని విభాగాలలో ఉత్పత్తి / పారిశ్రామిక / రవాణా కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుంది.
పారిశ్రామిక ఇంధనాలు సల్ఫర్, పెట్‌కోక్, నాఫ్తా డిమాండ్ వరుసగా 89.3%, 118%, 80.7% స్థాయికి చేరుకోగా, మెరైన్ ఇంధనాలు గత సంవత్సరం 138.5% స్థాయికి చేరుకున్నాయి. ఓఎంసి ల శుద్ధి కర్మాగారాల ముడి చమురు ఉత్పత్తి ఇప్పటికే 85% దాటింది, ఏప్రిల్ 20 ప్రారంభంలో 55% కంటే తక్కువగా ఉంది.
ఖరీఫ్ సీజన్లో రుతుపవనాలు సకాలంలో రావడంతో వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకోవడంతో, డీజిల్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2020 ఏప్రిల్ స్థాయి పరిమాణంలో 96% పెరిగింది (2020 ఏప్రిల్ లో 2.8 ఎంఎంటి నుండి 2020 జూన్ లో 5.5 ఎంఎంటి) ఎల్పిజి ఇంధనం కోసం డిమాండ్ పెరుగుతూనే ఉంది, 2019 జూన్ తో పోలిస్తే జూన్ 20 లో 16.6% బలమైన వృద్ధి సాధించింది.
అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం వందే భారత్ మిషన్ కింద 33% సామర్థ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చే విమానాలతో దేశీయంగా ఏవియేషన్ రంగాన్ని ప్రారంభించడంతో, ఎటిఎఫ్ వినియోగం 2020 ఏప్రిల్ స్థాయి నుండి 4 రెట్లు పెరుగుదలను నమోదు చేసింది (2020 ఏప్రిల్‌లో 52 టిఎంటి అయితే , 2020 జూన్‌లో 201 టిఎంటి గా నమోదయింది) అదేవిధంగా, ప్రధాన రహదారి నిర్మాణ ప్రాజెక్టుల పునః ప్రారంభంతో, బిటుమెన్ వినియోగం 2019 జూన్ తో పోలిస్తే 2020 జూన్ లో 32% ఘన వృద్ధిని నమోదు చేసింది.
మొత్తంమీద అన్ని పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 2020 ఏప్రిల్ స్థాయి 49% (2020 ఏప్రిల్ లో 6.6 ఎంఎంటి, 2019 ఏప్రిల్ లో 13.4 ఎంఎంటి) నుండి 2020 జూన్ లో 88% స్థాయికి పెరిగింది. లాక్ డౌన్ పరిమితుల సడలింపు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ, భారతీయ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుండడం నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
************
(Release ID: 1635756)
Visitor Counter : 254